మెంటల్ గాళ్లు.. సందీప్ రెడ్డి వంగే కరెక్ట్ మొగుడు..
బాలీవుడ్ లో మెంటల్ బ్యాచ్ ఎలా ఉంటారో మొన్నటికి మొన్న, ఓ ఇంటర్వూలో కోసి రాం పెట్టినట్టే తేల్చేశాడు సందీప్ రెడ్డి వంగ. అసలే తన సినిమాలు, ఇంటర్వూలు అన్నీంట్లో సందీప్ రెడ్డి అగ్రెషన్ ని బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది.

బాలీవుడ్ లో మెంటల్ బ్యాచ్ ఎలా ఉంటారో మొన్నటికి మొన్న, ఓ ఇంటర్వూలో కోసి రాం పెట్టినట్టే తేల్చేశాడు సందీప్ రెడ్డి వంగ. అసలే తన సినిమాలు, ఇంటర్వూలు అన్నీంట్లో సందీప్ రెడ్డి అగ్రెషన్ ని బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది. ఇలాంటి టైంలో మరో ట్రెండ్ సెట్టర్ అనురాగ్ కశ్యప్ బాంబు పేల్చాడు. బాలీవుడ్ కేరాఫ్ మెంటల్ హస్పిటల్ అనేశాడు. ప్రపంచ దరిద్రమంతా బీటౌన్ లోనే ఉందన్నారు. విషపు మనుషులు, విషపు సినిమాలు, విషపు ఆలోచనలు… ఇవి తప్ప హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమి లేవని తేల్చాడు. టాలీవుడ్, కోలీవుడ్ లోనే స్థిరపడేందుకు ఇక్కడికి ట్రావెల్ అవుతున్నాడు. ఒక వైపు సూర్య, జ్యోతిక, సమంత, పూజా హెగ్డే ఇలా అంతా కట్టకట్టుకుని ముంబై లో సెటిలౌతుంటే, అక్కడేం లేదని అనురాగ్ అన్న మాటలు తూటాల్లా పేలాయి. ఒక వైపు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ దర్శక నిర్మాతలకు పుండు మీద కారంలా మారితే, ఆ కారానికి మసాలాతో మంటపెడుతున్నాడు అనురాగ్ కశ్యప్.
బాలీవుడ్ ఇప్పటికే హిట్లు లేక, తెలుగుహీరోల పాన్ ఇండియా దండయాత్రలు భరించలేక, సౌత్ అంటేనే మండిపడుతోంది. ఎట్ దీ సేమ్ టైం హిందీలో వచ్చిన రీసెంట్లన్నీ తెలుగు దర్శకుల పుణ్యమే అన్న మాట, వాళ్లకి నిద్రపట్టకుండా చేస్తోంది. ఇది కాకుండా హిందీ దర్శక నిర్మాతలకి తెలివే కాదు, ధైర్యం కూడా లేదు, అందుకే తనని టార్గెట్ చేశారు. కాని యానిమల్ హీరో రణ్ బీర్ ని మాత్రం ఏమనలేకపోతున్నారన్నాడు.అసలే తమని తాము తోపులని ఎక్కువ ఊహించుకునే హిందీ హీరోలు, దర్శక నిర్మతలకు బాహుబలి నుంచి రాజమౌళి నిద్రపట్టకుండా చేస్తున్నాడు. సుకుమార్ వచ్చి పుష్పతో పంచ్ ఇచ్చాడు. దీనికి తోడు కన్నడ నుంచి కేజీయఫ్, కాంతారా లాంటి షాకులు, ప్రభాస్ వరుసగా చేస్తున్న పాన్ ఇండియా దండయాత్రలు బాలీవుడ్ సినీజనాల గుండెల్లో పిడుగుల్లా మారాయి
ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ వరకే తన దూకుడనుకుంటే, దేవరతో నార్త్ ఇండియాని కుదిపేశాడు. వార్ 2 మూవీలో తను విలన్ అని చిన్న చూపుచూసేలోపు, తను లేకపోతే వార్ 2 ని ఎవరూ పట్టించుకోలేనరేంతగా ఆ సినిమా అప్ డేట్స్ షాక్ ఇస్తున్నాయి. వార్ 2 లో ఎన్టీఆర్ మీద తప్ప నెటీజన్స్ ఎవరూ హ్రితిక్ ని పట్టించుకోకపోవటం ఇవన్నీచూస్తే, సౌత్ డామినేషన్ హిందీలో పెరిగినట్టే కనిపిస్తోంది.ఖాన్లూ కపూర్ల జమానా పోయింది. ఏదో జవాన్ తో షారుఖ్ 1000 కోట్లు కొల్లగొట్టాడు కదా అనుకుంటే అది ఆట్లీ తీసని మూవీ అని, తెలుగు నిర్మాత నాగవంశీ అన్న మాటలకు బాలీవుడ్ విరుచుకుపడింది. ఇక బాలీవుడ్ లో మరో రామ్ గోపాల్ వర్మ అనిపించుకున్నఅనురాగ్ కశ్యప్ అయితే, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ పనైపెయిందన్నాడు.
అక్కడ 500 కోట్లు 1000 కోట్ల వసూల్ల రాబట్టే మూవీలే టార్గెట్ పెట్టుకున్నారన్నారు. అలా టార్గెట్ పెట్టుకుంటే సినిమాలు రావు, ఆలోచించాలి ప్రయోగాలు చేయాలి… సౌత్ లా దమ్ముండాలి అన్నాడు. బాలీవుడ్ లో విషపు మనుషులు, విషపు పరిస్థితులే తప్ప అక్కడేం లేదనేశాడు. తెలుగుమూవీ డెకాయిట్ లో విలన్ గా నటిస్తున్న అనురాగ్ కశ్యప్ బాహుబలి టైం నుంచి తెలుగు మూవీల వెలుగుల మీదే పొగడ్తలు కురిపిస్తూ ఉన్నాడు. ఐతే బాలీవుడ్ లో క్రియేటివిటి చచ్చిపోయిందని, ప్రయోగాలు చేసే గుండె ధర్యం తెలివి, అక్కడి హీరోలు, దర్శక నిర్మాతలకు లేవన్నాడు. దీంతో తన మీద బాలీవుడ్ లో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. కాని రివ్యూరైటర్లు, బాలీవుడ్ లో మాఫియాలా తయారైన బ్యాచ్ లకి కోసి కారం పెట్టినట్టు మాట్లాడిన సందీప్ రెడ్డి వంగకి కౌంటర్ ఇచ్చేందుకు మాత్రం జంకుతున్నారు. నిన్న హిందీ మీడియా రిపోర్టర్లు, జాన్ అబ్రహం తోపాటు రోహిత్ శెట్టి అండ్ కోని సందీప్ రెడ్డి గురించి ప్రశ్నలు అడిగితే, రెస్పాండ్ కాలేదు. అయ్యేందుకు ధైర్యం చేయలేదు. దీంతో బాలీవుడ్ కి కరెక్ట్ మొగుడు సందీపే అంటూ నార్త్ ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హైలెట్ అవుతోంది.