Tamanna: పెళ్లికొడుకు దొరికాడు.. కాని పెళ్లి మిస్సైంది.. తమన్నా తలరాత..?
తమన్నా విచిత్రమైన పరిస్థితి ఫేస్ చేస్తోంది. మొన్నటి వరకు తను ఆ వ్యక్తితో ఏడడుగులు నడవబోతోంది, ఆ బిజినెస్ మ్యాన్ తో వెడ్డింగ్ కి రెడీ అయ్యిందన్నారు. కాని ఆ వ్యక్తి ఎవరో తెలియదు.. కట్ చేస్తే ఇప్పుడు తమన్నా నిజంగానే విజయ్ వర్మ అనే నటుడిని ప్రేమిస్తున్నట్టు మనసు విప్పింది.

Tamanna Love With Vijay Varma
తెలుగు మూవీ ఎమ్ సీ ఏలో విలన్ గా నటించిన విజయ్ వర్మ నిజానికి హైద్రబాద్ లో సెటిలైన ఓ మార్వాడీ వ్యక్తి అని తెలుస్తోంది. వర్మతో గత 6 నెలలుగా జర్నీ చేస్తున్న తమన్నా, అతని ప్రేమలో పడినట్టు, తనతో ఉంటే సేఫ్ గా హ్యాపీగా ఉంటానని తేల్చింది మిల్కీ బ్యూటీ.
అంతవరకు బానే ఉంది. ఇంతకాలం తనకు కాబోయే భర్త ఎవరా అని గుసగుసలు వచ్చాయి. కట్ చేస్తే పెళ్లి కొడుకు ఎవరో తేలింది. కాని తన పెళ్లి ఎప్పుడో తేలట్లేదు. కేవలం విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్టే తమన్నా తేల్చింది కాని, ఈ ప్రయాణం పెళ్లిపీటల వరకు ఎప్పుడు చేరుతుందో తేలలేదు. భోళశంకర్, జైలర్ రెండు తప్ప మరో తెలుగు సినిమా కాని, తమిళ్ మూవీ కాని కమిట్ కాలేదు తమన్నా. ఇవన్నీచూస్తుంటే, తమన్నా ఈ ఏడాది చివర్లోగా ఏడడుగులు నడిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.