Miss Shetty Mr Polishetty: ఆంటీతో బంటి.. ఇదేంటి పోలిశెట్టి..?
ఓ ఆంటీకి, కుర్రాడికి మధ్య లవ్ అంటూ కామెంట్లు, ట్రోలింగ్స్ పెరుగుతున్నాయి. సినిమాలో ఎల్డర్ ఉమెన్ అని అనుష్క గురించి డైలాగ్ విసిరినా జనాలు పట్టించుకోవట్లేదు. ఫార్టీ ప్లస్ ఆంటీతో థర్టీ ప్లస్ కుర్రాడి ధీనగాథ అంటున్నారు.

Miss Shetty Mr Polishetty: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.. మూవీలో డైలాగ్ చూస్తే ఇది బ్రో జోన్ కాదు, ఫ్రెండ్ జోన్ కానేకాదు, యూజ్ అండ్ థ్రో జోన్. ఈ డైలాగ్ సినిమాకు అప్లై అయ్యేలా ఉంది. ఓ ఆంటీకి, కుర్రాడికి మధ్య లవ్ అంటూ కామెంట్లు, ట్రోలింగ్స్ పెరుగుతున్నాయి. సినిమాలో ఎల్డర్ ఉమెన్ అని అనుష్క గురించి డైలాగ్ విసిరినా జనాలు పట్టించుకోవట్లేదు. ఫార్టీ ప్లస్ ఆంటీతో థర్టీ ప్లస్ కుర్రాడి ధీనగాథ అంటున్నారు. ఎక్కడా ఇద్దరిమధ్య కెమిస్ట్రీ కుదరట్లేదు.
ట్రైలర్‌లో విషయం ఉన్నట్టే కనిపిస్తోంది. కాని సోది అంటున్నారు. ఇక విచిత్రం ఏంటంటే అనుష్క ఏజ్ తగ్గించటానికి తన ఫేస్‌కి ఏదైనా గ్రాపికల్ ఎఫెక్ట్స్ ఇచ్చారో, లేదంటే స్కిన్ ముడతలు తగ్గించే మేకప్ వేశారో కాని తన ఫేస్‌లోఎక్స్‌ప్రెషన్సే లేవు. బొమ్మ మాట్లాడుతుందేమో అన్నట్టు ఉందనే కామెంట్లు పెరిగాయి. పిల్లలు కంటా.. తర్వాత వదిలేస్తా.. అనేంత బోల్డ్ రోల్‌లో అనుష్క, ఎమోషన్స్‌తో ప్రేమలో పడే పాత్రలో నవీన్ శెట్టి ట్రైలర్‌లో మాత్రం టార్చర్ చూపిస్తున్నారు. స్వింగ్‌లోఉన్న టైంలో నవీన్ పోలిశెట్టి ప్రయోగం అనుకుంటూ, అనవసరమైన టాస్క్ తీసుకున్నాడంటున్నారు.