Srilila : శ్రీ లీల కష్టాలు..
శ్రీలీల చేతినిండా సినిమాలున్నా.. కెరీర్ మాత్రం సాఫీగా సాగడం లేదు. మంచి డ్యాన్సర్‌గా తెచ్చుకున్నా.. పూజా.. సమంతలా గ్లామర్ హీరోయిన్ కాలేకపోయింది. పెర్‌ఫార్మెన్స్ అంతంత మాత్రమే. శ్రీలీలను అందరూ తెగ పొగిడేస్తున్నా.. కెరీర్ మాత్రం కష్టాల్లోనే నడుస్తోందా? శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయాన్న పేరేగానీ.. ఇంతవరకు స్టార్ ఇమేజ్ దక్కలేదు.

Missing Srilila in spite of everything.. What are the difficulties of that Srilila
శ్రీలీల చేతినిండా సినిమాలున్నా.. కెరీర్ మాత్రం సాఫీగా సాగడం లేదు. మంచి డ్యాన్సర్‌గా తెచ్చుకున్నా.. పూజా.. సమంతలా గ్లామర్ హీరోయిన్ కాలేకపోయింది. పెర్‌ఫార్మెన్స్ అంతంత మాత్రమే. శ్రీలీలను అందరూ తెగ పొగిడేస్తున్నా.. కెరీర్ మాత్రం కష్టాల్లోనే నడుస్తోందా? శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయాన్న పేరేగానీ.. ఇంతవరకు స్టార్ ఇమేజ్ దక్కలేదు. మూడు హిట్స్ వున్నా.. ఫ్లాపులతో కెరీర్ అప్‌డౌన్స్‌లో నడుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆశీస్సులతో పెళ్లిసందడిలో గ్లామర్‌గా కనిపించి ఆకట్టుకుంది. ఇక ధమాకాతో కమర్షియల్ హిట్ అందుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది శ్రీలీల. హ్యాట్రిక్ కొడదామనుకున్న శ్రీలీల కలను స్కంద బ్రేక్ చేసింది. సినిమాలో రామ్ ఈ అమ్మడిని ఏవరేజ్ ఫిగర్ అంటూ ఏడ్పించిన సీన్స్‌తో శ్రీలీల ట్రోల్ అయింది.
అప్పటివరకు మూడు సినిమాలు చేసినా.. నాలుగు పాటలు.. ఆరు సీన్స్ తప్ప శ్రీలీలకు వచ్చిన క్రేజ్ తక్కువే. ఇలాంటి టైంలో శ్రీలీలను భగవంత్ కేసరి ఆదుకుంది. పెర్‌ఫార్మెన్స్‌లో రోల్‌తో ఆకట్టుకున్న శ్రీలీలకు నటిగా మంచి మార్కులే పడినా.. ఆదికేశవ్‌తో మళ్లీ తన రూటులోకి వచ్చేసింది. భగవంత్ కేసరి తర్వాత శ్రీలీల నటించిన ఆదికేశవ వచ్చిన సంగతే తెలీకుండా వెళ్లిపోయింది. ఒక ఫ్లాప్.. ఒక హిట్‌తో శ్రీలీల కెరీర్ అప్ అండ్ డౌన్స్‌లో నడుస్తోంది. ప్లాప్ ముద్ర నుంచి బైటపడాలంటే.. 8నరిలీజ్ అవుతున్న ‘ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మేన్’ హిట్ చాలా అవసరం. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్‌లో డ్యాన్స్ ఇరగదీసినా.. రికగ్నైజ్డ్ రోల్లో కనిపిస్తుందో లేదో చూడాలి మరి.