Gaddar Awards: గద్దర్ పేరుతో సినిమా అవార్డులు.. మోహన్‌బాబు రియాక్షన్ ఇదే..
గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తే.. కులాల ప్రస్తావన తెరమీదకు వచ్చే అవకాశం ఉంటుందని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. సోషల్ మీడియా సాక్షిగా డిబేట్ మొదలుపెట్టారు. ఐతే రేవంత్ ప్రకటించిన అవార్డులపై.. హీరో మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు.
Gaddar Awards: ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ జయంతి వేడుకల్లో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు చేశారు. ఇకపై కళాకారులకు ఇచ్చే నంది అవార్డు స్థానంలో.. గద్దర్ జయంతి రోజు.. ఆయన పేరుతో.. కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డును ప్రదానం చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా.. అక్కడక్కడా నంది అవార్డుల పేరు మార్చవద్దని.. అవసరమైతే గద్దర్ పేరిట కొత్తగా అవార్డులు ఇవ్వండి అనేలా కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయ్.
Poonam Pandey: పూనమ్ పాండే మరణం.. వ్యాక్సిన్‌పై మళ్లీ చర్చ..
ఇంకొందరు అయితే.. హద్దులుదాటి మరీ కామెంట్లు చేస్తున్నారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తే.. కులాల ప్రస్తావన తెరమీదకు వచ్చే అవకాశం ఉంటుందని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. సోషల్ మీడియా సాక్షిగా డిబేట్ మొదలుపెట్టారు. ఐతే రేవంత్ ప్రకటించిన అవార్డులపై.. హీరో మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వానికి అభినందలు తెలిపారు. సాంస్కృతిక గుర్తింపుపై ఇది.. వారికున్న నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఇక తన సోదరుడు గద్దర్ విషయంలో మరోసారి గర్వపడుతున్నానని తెలిపిన కలెక్షన్ కింగ్.. గద్దర్ పాటలు సమాజ పరివర్తనకు ఉత్ప్రేరకంగా పనిచేశాయని అన్నారు. గద్దర్ పేరిట అవార్డులను ఇవ్వడమనేది.. ఆయన చేసిన కృషికి, త్యాగానికి గొప్ప గౌరవ సూచికంగా భావిస్తున్నానని అన్నారు. వ్యక్తిగతంగా ఈ విషయం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా చెప్పాు.
ఈ ట్వీట్‌లో గద్దర్‌ను శాలువాతో సన్మానిస్తోన్న ఫొటోని కూడా ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలో మోహన్ బాబు కుమారుడు విష్ణు కూడా ఉన్నారు. గద్దర్‌కు, మోహన్ బాబు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. గద్దర్ స్వతంత్రంగా ఇంటిలోకి వెళ్లే వ్యక్తులలో మోహన్ బాబు కూడా ఒకరు. గద్దర్ చనిపోయినప్పుడు.. మోహన్ బాబు కన్నీరుమున్నీరయ్యారు.