Mohan Babu: సెగ్గడ్డ అని ఆయన.. సిగ్గులేదా అని ఈయన.. మీడియా మీద పెతాపమేంది మోహనా..?

క్రమశిక్షణకు, పట్టుదలకు మారు పేరు అంటారు మంచు కుటుంబం. మీడియా వాళ్ల మీద మాత్రం కస్సుమంటారు అదేంటో..! కోపం ఎక్కువైనా, ప్రేమ ఎక్కువైనా.. అక్కడిక్కడే చూపించేస్తుంటారు. మంచు కథలు ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? మీడియా మీద మళ్లీ గుస్సా అయ్యారు రామన్న చౌదరి.. అలియాస్‌ పెదరాయుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 13, 2023 | 02:46 PMLast Updated on: Jul 13, 2023 | 2:46 PM

Mohan Babu Once Again Angry On Media In Shadnagar

Mohan Babu: అడుగు వేస్తే మీడియా కావాలి.. అనుకోనిది జరిగితే మీడియాలో రావాలి.. సంబరం అయినా, సంతోషం అయినా, సెలబ్రేషన్ అయినా మీడియా కావాలి. అదే మీడియా ఒక్క ప్రశ్న అడిగితే సిగ్గులేదా అంటావా..? ఇదెక్కడి న్యాయం పెద రాయుడు సాబ్ ! వీళ్లేంటో, వీళ్ల విధానాలేంటో ఓ పట్టాన అర్థం కావు అన్నట్లు ఉంటారు మంచు కుటుంబంలో సభ్యులు. తాజాగా మీడియా మీద మళ్లీ కస్సుమన్నారు మోహన్‌ బాబు.. అసలేం జరిగింది..?

క్రమశిక్షణకు, పట్టుదలకు మారు పేరు అంటారు మంచు కుటుంబం. మీడియా వాళ్ల మీద మాత్రం కస్సుమంటారు అదేంటో..! కోపం ఎక్కువైనా, ప్రేమ ఎక్కువైనా.. అక్కడిక్కడే చూపించేస్తుంటారు. మంచు కథలు ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? మీడియా మీద మళ్లీ గుస్సా అయ్యారు రామన్న చౌదరి.. అలియాస్‌ పెదరాయుడు.. అలియాస్ మోహన్‌ బాబు. మీడియా మీద కోపం చూపించారు. బుద్ధి లేదా అంటూ గట్టిగానే ఓ మాట అనేశారు. ఉద్యోగాలు తీయించేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. లోగోలు లాక్కోమంటూ అనుచరుల్ని ఆదేశించారు. షాద్‌నగర్‌లో జరిగింది ఈ కథంతా..! షాద్‌నగర్‌లో మోహన్‌బాబుకు కొన్ని ఆస్తులు ఉన్నాయి. వాటి రిజిస్ట్రేషన్ పని కోసం ఆయన షాద్‌నగర్ వెళ్లినట్లు తెలుస్తోంది.

పెద్ద మనిషి, పేరున్న మనిషి కదా అని మోహన్‌బాబును మీడియా వాళ్లు పలకరించారు. అంతే.. అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు ఆయన! ఏదో పర్సనల్‌ పని మీద వచ్చాం అని చెప్తే అయిపోయేదానికి.. మీడియావాళ్లనే గదమాయించారు. అక్కడున్న మీడియా ప్రతినిధులపై నోరు పారేసుకున్నారు. మోహన్‌బాబు ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ మధ్య కూడా ఇలానే బిహేవ్‌ చేశారు. మంచు మనోజ్‌, విష్ణు మధ్య వివాదం గురించి రియాక్ట్ కావాలని అడిగితే.. మీ ఇంట్లో నీ భార్యకు నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పగలవా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎప్పుడు ఏది అడగాలో తెలుసుకోవాలని క్లాస్ పీకారు. అది మర్చిపోయేలోపే ఇప్పుడు షాద్‌నగర్‌లో ఇలా..! మోహన్‌బాబు మాత్రమే కాదు.. మంచు మనోజ్‌ది కూడా ఇదే తీరు.

ఆ మధ్య మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లి గొడవకు దిగాడు. ఐతే ఏం జరిగిందని మనోజ్‌ను అడిగితే సెగ్గడ్డ అయింది.. గోకుతారా అని అర్థంలేని కామెంట్లు చేశాడు. ఇలా మీడియా మీద మంచు కుటుంబానికి ఎందుకు ఇంత కోపం అన్నది అర్థం కాని పరిస్థితి. ఏం అవసరం వచ్చినా మీడియాను పలకరించే మీరు.. ఏం జరిగింది అని అదే మీడియా అడిగితే తప్పుగా కనిపిస్తుందా..? ఇవే కాస్త తగ్గించుకుంటే మంచిది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.