మోక్షజ్ఞకు ఆల్ ది బెస్ట్ సరే.. బాలయ్య గుర్తులేడా తారక్ !
నందమూరి వంశం నుంచి మరో హీరో.. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా రంగప్రవేశం చేయబోతున్నాడు.
నందమూరి వంశం నుంచి మరో హీరో.. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా రంగప్రవేశం చేయబోతున్నాడు. హనుమ్యాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఈ మూవీ రాబోతుండగా.. సుధాకర్ చెరుకూరితో కలిసి.. బాలయ్య కూతురు ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మోక్ష బర్త్ డే సందర్భంగా.. మూవీ ఫస్ట్ మూవీ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ లుక్‌లో మోక్ష కేక పుట్టిస్తున్నాడు. నందమూరి మూడో తరంలో మరో ఛార్మింగ్ హీరో రాబోతున్నట్టు పోస్టర్ చూస్తే క్లియర్‌గా అర్థం అవుతోంది. చాలామంది సోషల్ మీడియా వేదికగా మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు… హీరోగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా.. అన్నయ్యలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్విట్టర్ వేదికగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో పాటు హీరోగా హిట్ కావాలని కోరుకున్నారు. నటుడిగా తాత లెగసీని కంటిన్యూ చేయాలని రాసుకొచ్చారు. ఈ ప్రయాణంలో తాత ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాయని.. ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. ట్వీట్‌లో ఎక్కడా కూడా.. బాబాయి ఊసెత్తలేదు నందమూరి యంగ్ బ్రదర్స్. కొన్నేళ్లుగా రాజకీయంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో బాలయ్యకు సరిగా పొసగడం లేదు. బాలయ్య కూడా వీళిద్దరిని దూరం పెడుతూ వస్తున్నారనే చర్చ జరుగుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలతో పాటు… తాజాగా జరిగిన బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి వీళ్లిద్దరు హాజరు కాలేదు. ఫ్రాంక్‌లీ.. ఈ ఇద్దరి ఆహ్వానం ఎన్టీఆర్ వేరే షెడ్యూల్లో బిజీగా ఉండటంతో రాలేకపోయినట్టు బయటకు చెప్తున్నా.. అసలు కారణం వేరే ఉందనే టాక్ నడుస్తోంది. ఈ కార్యక్రమాలకు రావాలని ఉన్నా.. బాబాయితో విభేదాల కారణంగా రాలేని పరిస్థితులు వచ్చాయట. ఐతే ఇప్పుడు మోక్షజ్ఞకు విషెస్‌లోనూ బాలయ్య పేరును ఇద్దరు ప్రస్తావించకపోవడంతో.. నెటిజన్లు మరో చర్చకు కారణం దొరికింది. ఐతే బాలయ్య అంటే ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌కు ఎప్పుడూ ప్రేమే అని.. పేరు చెప్పనంత మాత్రాన.. దూరం జరిగినట్లు కాదని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.