Mokshagna Tej : హీరోగా మోక్షజ్ఙ రెడీ

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో వారసులే ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ కూడా చాలామంది స్టార్ హీరోల వారసులు హీరోగా లాంచ్ అవడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా.. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తునే ఉన్నారు. అదిగో, ఇదిగో అనడమే తప్పా.. మోక్షజ్ఙ ఎంట్రీ గురించి ఊరిస్తునే ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2024 | 10:50 AMLast Updated on: Feb 19, 2024 | 10:50 AM

Mokshajja Is Ready As A Hero

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో వారసులే ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ కూడా చాలామంది స్టార్ హీరోల వారసులు హీరోగా లాంచ్ అవడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా.. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తునే ఉన్నారు. అదిగో, ఇదిగో అనడమే తప్పా.. మోక్షజ్ఙ ఎంట్రీ గురించి ఊరిస్తునే ఉన్నారు. బాలయ్య కూడా అడిగిన ప్రతి సారి ఈ ఏడాది, వచ్చే ఏడాది అంటూ చెబుతు వస్తున్నారు. కానీ ఇప్పుడా సమయం వచ్చేసినట్టేనని చెప్పాలి.

గతంలో సోషల్ మీడియాకు, ఫోటో సెషన్‌కు దూరంగా ఉండే మోక్షజ్ఙ.. ఇప్పుడు మాత్రం కెమెరాలకు ఫోజులు ఇస్తున్నాడు. ఈ మధ్య మోక్షజ్ఞ (Mokshagna Tej ) లుక్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. ఇప్పుడు బరువు తగ్గి పర్ఫెక్ట్ హీరో కటౌట్‌లోకి వచ్చేసినట్టే ఉన్నాడు. మంచి ఫిట్ నెస్‌తో హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ మోక్షజ్ఞ కొత్త ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లైట్‌గా గడ్డంతో బ్లాక్ డ్రెస్‌లో రఫ్‌గా అదిరిపోయే లుక్‌లో ఉన్నాడు. దీంతో ఇక బాబు లాంచ్ అవడమే లేట్ అంటున్నారు.

బాలయ్య ఫ్యాన్స్ (Balayya Fans).. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా బాబుని హీరోగా దింపేయండని కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజులుగా మోక్షజ్ఙ ఎంట్రీ కోసం బాలయ్య కసరత్తులు చేస్తున్నట్టుగా వార్తలు వస్తునే ఉన్నాయి. ఫలానా డైరెక్టర్‌ మోక్షజ్ఙను లాంచ్ చేస్తారనే మాట వినిపిస్తోంది. ఇకపోతే మోక్షజ్ఞతో నేను చెయ్యాలనుకున్న ‘ఆదిత్య 999 మాక్స్‌’ (Aditya 999 Max). అది మోక్షజ్ఞ రెండో సినిమా అవుతుంది. ఒకవేళ మొదటి సినిమాయే అది కావచ్చు. ఇప్పటివరకైతే దాని గురించి ఆలోచించలేదు.మరి ఈ ఏడాది అయినా బాలయ్య.. కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడా లేదా అనేది చూడాలి.