December Movies: డిసెంబర్‌లో ఇంత పోటీనా.. ఆ సినిమాలన్నీ ఒకే రోజు రిలీజ్..?
డిసెంబర్ 8న రావాలని వరుణ్‌తేజ్ 'ఆపరేషన్ వేలెంటేన్'.. విశ్వక్‌సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చాలాకాలం క్రితమే ఫిక్స్ అయ్యాయి. అయితే అనుకోకుండా నితిన్ ఎక్స్‌స్ట్రా కూడా వచ్చి చేరింది. నాని హాయ్ నాన్న ఒకరోజు ముందు డిసెంబర్ 7న వస్తోంది.
December Movies: ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు రావడం పెద్ద విశేషం కాదు. అయితే.. అన్నీ క్రేజీ మూవీసే వస్తే.. మాత్రం అది హాట్ టాపిక్కే. వీకెండ్ హాలిడేస్ తప్ప.. ప్రత్యేకంగా సెలవుల్లేవు. లాంగ్ వీకెండ్ లేదు. మరి ఎవరూ తగ్గకుండా.. అందరూ కట్టకట్టుకుని డిసెంబర్ మొదటివారంలోనే ఎందుకొస్తున్నారు అన్నదే పెద్ద సీక్రెట్. డిసెంబర్ 8న రావాలని వరుణ్‌తేజ్ ‘ఆపరేషన్ వేలెంటేన్’.. విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చాలాకాలం క్రితమే ఫిక్స్ అయ్యాయి. అయితే అనుకోకుండా నితిన్ ఎక్స్‌స్ట్రా కూడా వచ్చి చేరింది.
నాని హాయ్ నాన్న ఒకరోజు ముందు డిసెంబర్ 7న వస్తోంది. ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌కు చోటు లేకపోయినా.. అందరూ అనుకున్న టైంకే వస్తామని రిలీజ్ డేట్ పోస్టర్స్ విడుదల చేసి సవాల్ విసురుతున్నారు. సలార్ రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్ యంగ్ హీరోల సినిమాలను ఇబ్బంది పెట్టింది. డిసెంబర్ 22న సలార్ వస్తుంటే.. క్రిస్మస్‌కు రావాల్సిన నాని హాయ్ నాన్న.. వెంకటేశ్ సైంధవ్.. నితిన్ ఎక్స్‌స్ట్రా రిలీజెస్ వాయిదా పడ్డాయి. సైంధవ్ సంక్రాంతికి వెళ్లిపోగా.. ఎక్స్‌స్ట్రా డిసెంబర్ 8పై.. హాయ్ నాన్న 7పై కన్నేశాయి. ఇన్ని క్రేజీ మూవీస్ ఒకేసారి రావడానికి పండుగ పబ్బం లేదు. చివరికి లాంగ్ వీకెండ్ కూడా లేదు. మరి ఇన్ని సినిమాలకు స్పేస్ లేకపోయినా.. మరో చాన్స్ వీళ్లకు లేదు. హాయ్‌నాన్న.. ఎక్స్‌స్ట్రా.. ఆపరేషన్ వేలంటేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చిన రెండు వారాలకు సలార్, డంకీ రిలీజ్ అవుతున్నాయి. ఈ నాలుగు సినిమాలు మొదటివారంలో కాకుండా సెకండ్ వీక్‌లో వస్తే.. సలార్ దెబ్బకు థియేటర్స్ దొరకవు.
సలార్ మేనియాలో తమ సినిమాలను ఎవరూ పట్టించుకోరని రెండు వారాల ముందు వస్తున్నాయి. పోనీ జనవరి ఫస్ట్ వీక్‌లో వస్తే.. రెండో వారంలో సంక్రాంతి సినిమాలన్నీ మీదపడి థియేటర్స్ లాగేసుకుంటాయి. ఇన్ని అడ్డంకులు వుండడంతో.. మరో ఆప్షన్ లేక అన్నీ కట్టకట్టుకుని మొదటివారంలోనే అదృష్టం పరీక్షించుకుంటున్నాయి.