Kalki kamal : కమల్ పాత్ర క్రూరంగానా…
సలార్ (Salaar) లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ తర్వాత్ పాన్ ఇండియా (Pan India) రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఏడి.. (Kalki 2898 AD) ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలు అయినా తనకంటూ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ కల్కి 2898 ఏడి సినిమా తెరకెక్కుతోంది.

Most prestigious movie Kalki 2898 AD.. Kamal's role in the movie is brutal...
సలార్ (Salaar) లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ తర్వాత్ పాన్ ఇండియా (Pan India) రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఏడి.. (Kalki 2898 AD) ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలు అయినా తనకంటూ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ కల్కి 2898 ఏడి సినిమా తెరకెక్కుతోంది. యూనిక్ సై ఫై ఫాంటసీ థ్రిల్లర్ గా పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈ మూవీ కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాదు మూవీ లవర్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.. మహాభారతం లోని పాత్రలు ఈ సినిమాలో కనిపించనున్నాయన్న వార్తలు ఈ మూవీపై మరింత హైప్ పెంచుతండగా.. రీసెంట్ గానే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వథామ పాత్ర చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. కాగా.. ఇప్పుడు ఈ మూవీ నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కమల్ హాసన్ కల్కి రోల్ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.. ఈ మూవీలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పాత్ర కోసం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. కమల్ పాత్ర పురాణాల్లోని కృష్ణుడి మేనమావ కంశుడి కేరెక్టర్ కి పోలి ఉంటుందని ఓ టాక్ వినిపిస్తోంది.. కమల్ పాత్రని నాగ్ అశ్విన్ కంశుడిని రిఫరెన్స్‌గా తీసుకొని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.. ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడమే లక్ష్యంగా చేసుకొన్న క్యారెక్టర్‌లో అత్యంత క్రూరంగా కమల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.. ప్రభాస్ పాత్రకు, కమల్ పాత్రకు మధ్య వచ్చే సీన్స్ ను అద్భుతంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
కమల్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ లో ఉండనుందనే వార్తల వల్ల తమిళంలో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కల్కి సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుందని తెలుస్తోంది. అయితే మేకర్స్ నుంచి మాత్రం అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ప్రభాస్ పాత్ర కూడా విష్ణు అవతారం అన్నట్టుగా కూడా బజ్ ఉంది.. ఈ వార్తలతో కల్కి మూవీపై అంచనాలు స్కై హైగా పెరిగిపోతున్నాయి.. ఇక కమల్ పాత్రను పరిచయం చేస్తూ త్వరలో ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. కమల్ పాత్ర గ్లింప్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.