3000 రూపాయలా..? రాజమౌళి మూవీ టిక్కెట్ కైతే ఆస్తులమ్మాలా.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప2 ప్రివ్యూ టిక్కెట్ 3000... ఇక ఏపీ తెలంగాణతో ఈ సినిమా టిక్కెట్ ఎంతపెంచుకోవచ్చో లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే. 300 కోట్లు పెట్టాం కాబట్టి 600 కోట్లు రాబట్టాలని ఒకరు... 500 కోట్లుపెట్టాం కాబట్టి వెయ్యికోట్లురాబట్టాలని ఇంకొకరు,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2024 | 04:09 PMLast Updated on: Dec 03, 2024 | 4:09 PM

Movie Audience Fire On Pushpa Ticket Rates

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప2 ప్రివ్యూ టిక్కెట్ 3000… ఇక ఏపీ తెలంగాణతో ఈ సినిమా టిక్కెట్ ఎంతపెంచుకోవచ్చో లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే. 300 కోట్లు పెట్టాం కాబట్టి 600 కోట్లు రాబట్టాలని ఒకరు… 500 కోట్లుపెట్టాం కాబట్టి వెయ్యికోట్లురాబట్టాలని ఇంకొకరు, ఇలా ఆడియన్స్ ఆస్తుల్ని టిక్కెట్ల రూపంలో కొల్లగొట్టాలనుకుంటే ఎలా? ఉన్నోడు కొంటాడు, లేనోడు ఊరుకుంటాడు అన్న సమాధానం రావొచ్చు కాని, ఆ ఆటిట్యూడ్ అసలుకే ఎసరు పెట్టేస్తుంది. ఇదే ఇలా ఉంటే, మరి 1000 కోట్లు రాజమౌళి మూవీ పరిస్తితేంటి? అంత పెట్టాం కాబట్టి ఏ పదివేలకో, పదిహేను వేలకో టిక్కెట్ రేట్లు పెంచుతారా? అంటే అభిమానులు కూడా ఈ సినిమా టిక్కెట్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా? అభిమానులే తమకు అన్నీ అని వాళ్ల ఆస్తులకే ఎసరు పెట్టేస్తున్నారా? ఓవరాల్ గా ఓ లుక్కేయండి.

పుష్ప 2 మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుంటే, మొన్నటి వరకు మెగా ఫ్యాన్స్, లేదంటే పవన్ ఫ్యాన్సే కామెంట్ల తూటాలు పేల్చారు. సరే మెగా కాంపౌండ్ కి బన్నీ దూరమవటమే కారణం అనుకోవచ్చు.. కాని ఇప్పుడు న్యూట్రల్ అనుకున్న కామన్ ఆడియన్స్ నుంచి కూడా ఊహించని స్తాయిలో, అది పుష్ప2 రిలీజ్ కి రెండు రోజుల ముందునుంచే ఈ విమర్శలు పెరగటం నిజంగా షాకింగే..

20, 30 కోట్లు తీసుకునే హీరోలని, పాన్ ఇండియా సినిమా పేరుతో వందకోట్లిచ్చి ఓ దిక్కుమాలిన కల్చర్ ని స్టార్ట్ చేసింది టాలీవుడ్ నిర్మాతలే అంటూ ఓ భారీ కామెంట్ రీసౌండ్ చేస్తోంది..నిజమే బాహుబలి వల్ల మన సినిమాకు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ తెరుచుకుంది. వెయ్యికోట్ల వరద కామనైంది. అలాని సినిమానే ఐదారు వందలకోట్లతో తీస్తే, పెట్టింది రావటంమే ఖష్టం, హిట్టైనా, లాభాలు కష్టం… ఆ కష్టాన్ని, నష్టాన్ని భర్తి చేసేందుకు ఆడియన్స్ నుంచి అడ్డగోలుగా టిక్కెట్ రేటుతో రాబట్టేస్తానంటే, థియేటర్స్ బిజినెస్సే మూతపడు పరిస్థితి వస్తుంది

త్రిబుల్ ఆర్ టైంలోనే 350 నుంచి 450 వరకు టిక్కెట్ రేటుంటే, మొదటి వారం జనాలు క్రేజ్ తో చూశారు కాని, ఆతర్వాత రెండో వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తగ్గింది. ఐదారుగురు ఉండే ఫ్యామిలీ టిక్కెట్లకే 2500, ట్రాన్స్ పోర్ట్, ఇంటర్వెల్ ఖర్చులు కలుపుకుని మొత్తంగా 5 వేలు పెట్టి సినిమా చూడాల్సిన పరిస్తితి.. అదే ఎమౌంట్ పెండితే, చాలా వస్తువులొస్తాయి, లేదంటే రెండు మూడేళ్ల ఓటీటీ సబ్ స్క్రిప్షన్ వస్తుంది కాబట్టి, అలా అలోచించే సగటు మీడిల్ క్లాస్ బ్యాచ్ ఈమధ్య థియేటర్స్ కి రావటమే మానేశారు

ఇది తెలిసే త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఎఫ్ 3 కి టిక్కెట్ రేట్లు తగ్గించి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు దిల్ రాజు.. అలా ఇంత జరిగినా, అత్యాశకు పోయి పుష్ప2 రేట్లు ఘాటెక్కించటం మొదటికే మోసం అయ్యేలా ఉంది. అసలు 500 కోట్ల పుష్ప2 కే కామన్ టిక్కెట్ రేటు 500 నుంచి 1250 కి పెరిగితే, మరి మహేశ్ బాబుతో రాజమౌలి తీసే సినిమా పరిస్తితేంటి?..

ఫ్యాన్స్ కిడ్నీలమ్ముకుని టిక్కెట్లు కొనాల్సి వస్తుందేమో..? ఇది కామెంట్ రూపంలో పేలుతున్న సెటైర్. తెలుగు సినిమా పాన్ ఇండియాని కుదిపేస్తోందని, హీరోల రెమ్యునరేషన్లు 100 కోట్ల నుంచి 300 కోట్ల వరకు పెంచిందే తెలుగు నిర్మాత.. హీరోకే అంతిస్తే, మేకింగ్ కి, మిగతా వాళ్లకి ఏమిస్తారు, మేకింగ్ కి ఎంత ఖర్చు పెడతారు… అంతా చేసిన ఆసినిమా హిట్టైనా పెట్టిన పెట్టుబడి రాబటమే ఎక్కువ… ఇక లాభాలు రావాలంటే అద్భుతం జరగాల్సిందే.. మరి ఇది కూడా తెలియకుండా సినిమాలు తీస్తున్నారా? అంటే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ వల్ల కొంత్త కలిసొస్తోందని అనుకుంటున్నారు. కాని అక్కడ నుంచి ప్రొడ్యూసర్స్ ఈమధ్య లాభాలు పిండుకోలేకపోతున్నారు. ఓటీటీ ఓనర్లు కూడా కండీషన్లతో సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఏదేమైనా సలార్, కల్కీ, దేవరతో పోలిస్తే, పుష్ప2 టిక్కెట్ రేట్లు కామన్ ఆడియన్ జేబులకు పోట్లు పొడిచేలా ఉంది.