రష్మిక ఇంత పిసినారా…? డబ్బుల కోసం మరీ కక్కుర్తి

సంధ్య థియేటర్ ఘటన విషయంలో పుష్ప సినిమా యూనిట్ మొత్తం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆరోజు రాత్రి సినిమా చూడటానికి వెళ్ళిన సినిమా యూనిట్ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2024 | 07:30 PMLast Updated on: Dec 26, 2024 | 7:30 PM

Movies Fires On Rashmika Mandanna

సంధ్య థియేటర్ ఘటన విషయంలో పుష్ప సినిమా యూనిట్ మొత్తం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆరోజు రాత్రి సినిమా చూడటానికి వెళ్ళిన సినిమా యూనిట్ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సామాన్య ప్రజల్లో కూడా ఆ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. సినిమా చూడటానికి వెళ్లిన వాళ్లు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం అనేది అందరిని కలచివేసింది. ఇక ఆ ఘటన తర్వాత బాధిత కుటుంబానికి ఎవరికి వారుగా సహాయం చేస్తూ వచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు సహాయం చేయగా పుష్ప సినిమా యూనిట్ మొత్తం రెండు కోట్ల రూపాయల సహాయం చేసింది. మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు అలాగే సుకుమార్ 50 లక్షలు అల్లు అర్జున్ కోటి రూపాయలు సహాయం చేశారు. అలాగే సుకుమార్ భార్య కూడా ఐదు లక్షల రూపాయల సహాయం అందించారు. అలాగే ఆ చిన్నారి భవిష్యత్తుకు తాము ఏం చేయాలనేది కూడా చేస్తామని ఆందోళన అవసరం లేదంటూ ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్లారిటీ ఇస్తూ వచ్చారు.

కానీ ఆరోజు సినిమా చూడటానికి వెళ్ళిన రష్మిక మందన మాత్రం రూపాయి కూడా సహాయం చేయలేదు. ఆరోజు సినిమా చూసిన వాళ్ళలో అల్లు అర్జున్ తో పాటుగా రష్మిక మందన అలాగే శ్రీలీల కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒక్కరు అంటే ఒక్కరు కూడా కనీస రూపాయి కూడా సహాయం చేయలేదు. కనీసం ఆసుపత్రికి వెళ్లి ఆ చిన్నారిని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సరే హీరోయిన్లు మాత్రం కనీసం ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఎక్కడా లేదు.

అసలు ఆ ఘటనలో లేని మైత్రి మూవీ మేకర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా సహాయం చేశారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేసిన తబిత సుకుమార్ కూడా తనవంతు సహాయం అందించారు. అయినా సరే రష్మిక గాని శ్రీలీల గాని ముందుకు రాలేదు. శ్రీలీల అంటే ఐటమ్ సాంగ్ చేసింది కాబట్టి ఆమెను పక్కన పెడితే రష్మిక సినిమాలో హీరోయిన్. ఆమె గురించి కూడా అక్కడికి భారీగా అభిమానులు వచ్చారు. అసలు అక్కడ సంబంధం లేని వాళ్ళపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. సంధ్య థియేటర్ యాజమాన్యం జైలుకు వెళ్లి వచ్చింది. అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లి వచ్చాడు. కానీ రష్మిక మందన పై మాత్రం కేసు నమోదు కాలేదు. చివరకు మైత్రి మూవీ మేకర్స్ పై కూడా కేసు పెట్టారు పోలీసులు. అలాంటిది సినిమా చూసి తన అభిమానులకు అభివాదం చేసి హడావుడి చేసిన రష్మిక మందన పై ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటనలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యుడు కాదు. రష్మికపై కూడా కేసు నమోదు చేయాలని.. ఆమె కూడా సహాయం చేయాలని డిమాండ్లు వినపడుతున్నాయి. సినిమా కోసం ఆమె కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంది.