Movies in this Week: ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..!

సంక్రాంతి సీజన్‌లో దాదాపు అన్నీ పెద్ద హీరోల సినిమాలే సందడి చేశాయి. దీంతో ఇప్పుడు దాదాపు అన్నీ చిన్న సినిమాలే రిలీజ్‌కు రెడిగా ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2023 | 12:54 PMLast Updated on: Feb 28, 2023 | 12:54 PM

Movies Going To Release In This Week

2023లో అప్పుడే సెకండ్‌ మంథ్‌ కూడా ఎండింగ్‌కు వచ్చేసింది. సంక్రాంతి సీజన్‌లో దాదాపు అన్నీ పెద్ద హీరోల సినిమాలే సందడి చేశాయి. దీంతో ఇప్పుడు దాదాపు అన్నీ చిన్న సినిమాలే రిలీజ్‌కు రెడిగా ఉన్నాయి. దీనికి తోడు పరీక్షలు కూడా ఉండటంతో మరో మూడు నాలుగు వారాలపాటు ఈ సినామలే థియేటర్లలో ఉండనున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేయండి.

1 బలగం
పెళ్లి చూపులు ఫేమ్‌ ప్రియదర్శి, వల్లంకి పిట్ట కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా బలగం. విలేజ్‌ బ్యాగ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు వేణు వెల్దండి దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు ప్రొడ్యూసర్‌ ప్రోమోలతోనే మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా మార్చ్‌ 3న ప్రేక్షకుల మందుకు రానుంది.

2 ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు..
కొంచెం గ్యాప్‌ తరువాత సీనియర్‌ డైరెక్టర్‌ ఎస్వీ కృష్టారెడ్డి మరో సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అదే ఆర్గానిక్‌ మామ-హైబ్రీడ్‌ అల్లుడు. ప్రొడ్యూసర్‌ కోనేరు కల్పన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, మీనా, సోహైల్, మృణాళిని మెయిన్ లీడ్స్‌ పోషిస్తున్న ఈ సినిమా మార్చి 3న ఆడియన్స్‌ను పలకరించనుంది.

3 రిచి గాడి పెళ్లి..
సత్య, చందన రాజ్ లీడ్‌ రోల్స్ ప్లే చేసిన సినిమా రిచిగాడి పెళ్లి. ఈ సినిమాకు కేఎస్‌ హేమరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా మార్చ్‌ 3 న రిలీజ్‌ కానుంది.

4 సాచి..
వివేక్‌ పోతగోని డైరెక్షన్‌లో వస్తున్న సాచి సినిమా కూడా మార్చి 3న థియేటర్లలో సందడి చేయనుంది. బిందు అనే యువతి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సంజన, గీతిక రధన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

5 గ్రంథాలయం..
సాయి శివన్‌ జంసన డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ గ్రంథాలయం కూడా మార్చ్ 3న రిలీజ్‌ కానుంది. విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.