మిస్టర్ బచ్చన్ తుస్, 70 ఎంఎం రాడ్డు…
మాస్ మహారాజ రవితేజా హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్స్ కు డిఫరెంట్ టాక్ వినపడుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన రివ్యూస్ లో ఫ్యాన్స్ మాత్రమే సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ చెప్తుండగా… కేవలం సినిమా అభిమానులు మాత్రం సినిమా అంతగా బాగా లేదంటున్నారు. మంచి కథను హడావుడిగా హరీష్ శంకర్ తెరకెక్కించారు అని, కాస్త వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది అనే టాక్ వినపడుతోంది. రవితేజా మాస్ సీన్స్ లో తన మార్క్ ఎనర్జిటిక్ యాక్టింగ్ తో దుమ్ము రేపాడు. ఇక పాటల విషయంలో మిక్కీ జే మేయర్ అంచనాలను అందుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కొన్ని సీన్స్ లో రవితేజాను సరిగా వాడుకోలేకపోయాడు హరీష్ శంకర్.
ఇక హీరోయిన్ విషయానికి వస్తే… అమ్మడు సినిమాకు హైలెట్ గా నిలిచింది. కచ్చితంగా టాలీవుడ్ కు కొత్త హీరోయిన్ దొరికినట్టే అంటున్నారు సినిమా అభిమానులు. పక్కా కమర్షియల్ సినిమాగా మిస్టర్ బచ్చన్ ను దర్శకుడు తెరకెక్కించాడు. కమర్షియల్ హంగులపై పెట్టిన శ్రద్ధ సినిమాను హ్యాండిల్ చేయడంపై పెట్టి ఉంటే బాగుండేదనే టాక్ ట్విట్టర్ లో వచ్చింది. కమెడియన్ సత్య తన యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని నడిపించాడని, కామెడి సీన్లలో హరీష్ శంకర్ మార్క్ పక్కాగా కనపడింది అంటున్నారు ఫ్యాన్స్. అయితే కొత్తగా సినిమాలో ఏం లేదు… రొటీన్ గానే ఉందనే రివ్యూలు వస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ పెట్టిన డైలాగ్స్ బాగా పేలాయి. “నేను నీలా మాయల మాంత్రికుడ్ని, మాటల మాంత్రికుడ్ని కాదు మేటర్ ఉన్నోడ్ని” అంటూ త్రివిక్రమ్ టార్గెట్ గా డైలాగ్స్ పెట్టాడు. ఈ డైలాగ్ వినపడుతున్నప్పుడు ఆడియన్స్ ఈలలతో మార్మోగించారు. ఇక మాస్ ఆడియన్స్ కు హీరోయిన్ ను చూపించిన విధానం పిచ్చ పిచ్చగా నచ్చేసింది. యాక్షన్ సీక్వెన్స్ లో రవితేజా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక జగపతి బాబు ఎప్పటి లాగే తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఓవరాల్ గా సినిమాపై వర్కౌట్ చేసి ఉంటే మాత్రం ఇంకా బాగా వచ్చేది అంటున్నారు సినీ జనాలు.