Mrunal Thakur: స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం అడుగులు వేస్తున్న మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బ్యూటీ. అందమైన ప్రేమ కథలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది. దీంతో ఈ లేడీ దశ తిరిగినట్టే అని అంతా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆచితూచి కథలను సెలక్ట్ చేసుకోంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2023 | 06:19 PMLast Updated on: Oct 23, 2023 | 6:19 PM

Mrunal Thakur Aimed On Top Position In Tollywood

Mrunal Thakur: ప్ర‌తి ఏడాది ఇండ‌స్ట్రీలోకి కొత్త హీరోయిన్స్ వ‌స్తుంటారు. పోతుంటారు. కానీ, కొంతమంది మాత్రమే గోల్డెన్ లెగ్ అనిపించుకుంటారు. పెర్ఫామెన్స్‌, గ్లామ‌ర్‌తో థ్రిల్ చేసి కాంపిటీష‌న్‌లో దూసుకుపోతారు. ప్రజెంట్ ఇదే రూట్‌లో జోరు పెంచిన ఓ హాట్ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ టాప్ చైర్‌పై కన్నేసింది. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బాక్సాఫీస్‌పై ఎటాక్ చేయబోతోంది. మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బ్యూటీ. అందమైన ప్రేమ కథలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది.

దీంతో ఈ లేడీ దశ తిరిగినట్టే అని అంతా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆచితూచి కథలను సెలక్ట్ చేసుకోంటోంది. ఎన్ని ఆఫర్స్ వచ్చినా సరే.. నచ్చిన పాత్రకే ఒకే చెబుతోంది. సీతారామం వచ్చి ఏడాది పూర్తైనా ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేస్తోంది మృణాల్. వీటితో టాప్ ఛైర్‌ని కబ్జా చేయాలని పక్కా ప్లాన్‌ని అప్లై చేస్తోంది. నాని హీరోగా తెరకెక్కుతున్న హాయ్ నాన్నలో హీరోయిన్‌గా నటిస్తోంది మృణాల్‌. ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో సాగనున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 7న సౌత్, నార్త్‌లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కూతురు ప్రేమకు, అమ్మాయి ప్రేమకు మధ్య ఉండే వేరియేషన్‌ని ఈ సినిమాలో డెప్త్ గా చూపించబోతున్నాడు డైరెక్టర్. నాని, మృణాల్ మ‌ధ్య రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉండబోతోంది.

ఇదే విషయాన్ని టీజర్‌లో లిప్ లాక్ సీన్‌లతో రివీల్ చేశాడు శౌర్యువ్‌. ఈ సినిమా తన కెరీర్‌కి భారీ క్రేజ్ తెచ్చిపెడుతుందని బలంగా నమ్ముతోంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తోంది. ఈ సినిమా కూడా మృణాల్‌కి బ్లాక్ బస్టర్‌ని అందించే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి సీతారామం తర్వాత మృణాల్ చేస్తున్న ఈ రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్టులే. ఇవి కనుక సక్సెస్ అయితే మృణాల్ స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయినట్టే.