Mrunal Thakur: పెళ్లి కబురు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటా..
నాచురల్ స్టార్ నాని హీరోగా గురువారం రోజు విడుదలైన ఈ సినిమాకి బాగుందనే టాక్ అయితే వస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మృణాల్ నటనకి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో మృణాల్ తన ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Mrunal Thakur: సీతారామంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాందించిన నటి మృణాల్ ఠాకూర్. ఇప్పుడు ఆమె లేటెస్ట్‌గా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాచురల్ స్టార్ నాని హీరోగా గురువారం రోజు విడుదలైన ఈ సినిమాకి బాగుందనే టాక్ అయితే వస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మృణాల్ నటనకి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో మృణాల్ తన ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Extra Ordinary Man Review: నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ హిట్ కొట్టినట్టేనా..!
ఇదిలా ఉండగా.. తన తదుపరి సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ షూట్‌లో భాగంగా మృణాల్ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్నారు. ‘హాయ్ నాన్న’కు వస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులతో కాసేపు మాట్లాడేందుకు అక్కడి థియేటర్‌కు వెళ్లారు. ‘సీతారామం’ నుంచి న్యూజెర్సీ తనపై ఎంతో ప్రేమను కురిపిస్తోందని.. ‘హాయ్ నాన్న’తో ఇక్కడి ప్రేక్షకులను కలవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇంతలో అక్కడే ఉన్న ఓ పిల్లాడు.. ”మీకు పెళ్లైందా?” అని ప్రశ్నించాడు. ఆ మాటలకు నవ్వులు పూయించిన ఆమె ”త్వరలోనే.. త్వరలోనే.. పెళ్లి చేసుకుంటా” అని బదులిచ్చారు. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం మూవీలో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట హిందీలో పలు సీరియల్స్‌లో నటించింది. తర్వాత తెలుగు జెర్సీ సినిమాకు రీమేక్‌గా వచ్చిన హిందీ మూవీలో హీరోయిన్‌గా నటించి ఆ సినిమాతో హిట్ అందుకుంది. అలా బాలీవుడ్‌లో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ సీతామహాలక్ష్మిగా, ఫ్రిన్స్ నూర్జహాన్‌గా సీతారామం మూవీతో కోట్లాదిమంది ప్రేక్షకులను మెప్పించింది.