ప్రభాస్ కు పెళ్లి చేస్తున్న వంగా… వైఫ్ గా సీత ను ఫైనల్ చేసేసాడు
పాన్ ఇండియా ఏకైక స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో చాలా ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే సౌత్ కొరియా విలన్ ను ఈ సినిమాలో ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.
పాన్ ఇండియా ఏకైక స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో చాలా ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే సౌత్ కొరియా విలన్ ను ఈ సినిమాలో ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి డైరెక్షన్ కు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోతో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. సినిమా వీలైనంత ఫాస్ట్ గా రిలీజ్ చేయాలని బాక్సాఫీస్ తుక్కు రేగ్గోట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో చాలా పక్కా లెక్కలతో ఉంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ వద్దన్నా సరే బాలీవుడ్ స్టార్లను ఈ సినిమాలో తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం సైఫ్ అలీ ఖాన్ అలాగే కరీనా కపూర్ ను ఇప్పటికే ఒప్పించాడు. వీళ్ళిద్దరూ నెగిటివ్ రోల్ లో కనపడడానికి రెడీ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి కంప్లీట్ గా మొదలయ్యే ఛాన్స్ ఉంది. వాస్తవానికి డిసెంబర్ నుంచి మొదలు కావాల్సి ఉన్న ప్రభాస్ కు షూటింగ్లో గాయం కావడంతో సినిమా ఆలస్యం అవుతుంది.
ఇక స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారు… ఏంటనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. విలన్ ఫైనల్ అయిన హీరోయిన్ ఎవరనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు సందీప్ రెడ్డి. ఈ సినిమాలో హీరో కి పెళ్లి కూడా అయిపోతుందట. తన ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ కి పెళ్లి చేసే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో కూడా ప్రభాస్ కు పెళ్లి చేసే విధంగానే కథ రాసుకున్నాడు. ఈ నేపద్యంలో ప్రభాస్ వైఫ్ గా ఎవరు నటించబోతున్నారు అనే దానిపై స్పష్టత రావటం లేదు. ముందు అనిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందనాను తీసుకోవాలనుకున్నాడు.
అయితే ప్రభాస్ హైట్ కు ఆమె మ్యాచ్ కాకపోవడంతో వెనకడుగు వేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ పక్కన నటించేందుకు ఇద్దరు హీరోయిన్ల పేర్లను పరిశీలించగా ప్రభాస్ హైట్ తో మ్యాచ్ అయ్యే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రమే. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ కు వైఫ్ గా నటించనుంది. ప్రభాస్ స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా ఒక క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ స్పిరిట్ సినిమా ముందుకు వెళ్లే ఛాన్స్ కనబడుతోంది.