Muralidharan: ఎట్టకేలకు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ రీస్టార్ట్‌.. హీరోగా ఆస్కార్‌ మూవీ యాక్టర్‌ ఫైనల్‌

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ రీస్టార్ట్‌ కాబోతోంది. "800"(ఎయిట్‌ హండ్రెడ్‌) అనే టైటిల్‌తో వస్తున్న ఈ మూవీలో ఎట్టకేలకు హీరోను ఫైనల్‌ చేశారు మేకర్స్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2023 | 01:30 PMLast Updated on: Apr 17, 2023 | 1:58 PM

Muralidharan Movie Shooting

స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌ సినిమాలో కీ రోల్‌లో యాక్ట్‌ చేసిన మధుర్‌ మిట్టల్‌ను ఫైనల్‌ చేశారు. ఈ సినిమాకు సబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఇవాళ రిలీజ్‌ చేశారు. మురళీధరన్ అన్‪నోన్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీపతి డైరెక్ట్‌ చేస్తున్నాడు. క్రికెటర్‌ లైఫ్‌ హిస్టరీ కావడంతో మోషన్‌ పోస్టర్‌ను క్రికెట్‌ ఫ్యాన్స్‌ కేరింతలతో స్టార్ట్‌ చేశారు. పోస్టర్‌లో హీరోను రివీల్‌ చేసిన తీరు అద్భుతంగా ఉంది. పోస్టర్‌కు తగ్గట్టుగా బీజీఎం దుమ్ములేపింది. ఈ సినిమాకు ఫేమస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జిబ్రాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. జస్ట్‌ బీజీఎంతోనే సినిమాలో మ్యూజిక్‌ ఏ రేంజ్‌లో ఉండంబోతోందో చెప్పేశాడు జిబ్రాన్‌.

నిజానికి ఈ సినిమా రెండేళ్లక్రితమే స్టార్ట్‌ కావాల్సి ఉంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతిని హీరోగా అనుకున్నారు. సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడు. దీంతో అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉన్న ప్రాజెక్ట్‌ను ఇప్పుడు మళ్లీ లైన్‌లో పెట్టారు మేకర్స్‌. మధుర్‌ మిట్టల్‌ను ఫైనల్‌ చేసి ప్రాజెక్ట్‌ రీస్టార్ట్‌ చేశారు. ప్రస్తుతం అజయ్‌ దేవగన్‌ హీరోగా వస్తున్న మైదాన్‌ మూవీలో బిజీగా ఉన్నాడు మధుర్‌. ఈ సినిమా కంప్లీట్‌ అవ్వగానే 800 (ఎయిట్‌ హండ్రెడ్‌) షూటింగ్‌ స్టార్ట్‌ చేసే చాన్స్‌ ఉంది.