Music Director: కీరవాణి కి మెదటి ఆస్కార్ ఎప్పుడో వచ్చిందా?
నాటు నాటు సాంగ్‌తో కీరవాణి తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ తీసుకొచ్చారు. అయితే.. ఇది తనకు రెండో ఆస్కార్ అంటున్నారు. మొదటి అకాడమీ అవార్డ్ తీసుకుని చాలాకాలం అయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు కీరవాణి.
నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రచయిత చంద్రబోస్‌తో కలిసి కీరవాణి ఆస్కార్ అందుకున్నారు. ప్రతి ఏడాది ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఏదో ఒక సాంగ్ ఆస్కార్ గెలుచుకున్నా.. నాటు నాటు సాంగ్‌లా వరల్డ్ వైడ్ పాపులర్ కాలేదు. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన కీరవాణి ఓ ఇంటర్వ్యూలో ఇది తనకు రెండో ఆస్కార్ అనడం షాక్ ఇచ్చింది.
కీరవాణి ఓ ఇంటర్వ్యూలో.. రామ్‌గోపాల్ వర్మ తన ఫస్ట్ ఆస్కార్ అవార్డని చెప్పారు .
కెరీర్ బిగినింగ్‌లో తాను చేసిన ట్యూన్స్‌ను క్యాసెట్ గా చేసి 50 మందికి ఇచ్చానని.. విని రామ్‌గోపాల్ వర్మ క్షణంక్షణం సినిమాకు ఇచ్చారన్నారు. క్షణం క్షణం కారణంగానే.. తనకు అవకాశాలు వచ్చాయని.. ఆస్కార్ వచ్చిందంటే వర్మ కారణమని.. అందుకే తొలి ఆస్కార్ వర్మ అని పేర్కొన్నారు కీరవాణి.
కీరవాణి పొగడ్తలకు తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు వర్మ. కీరవాణి మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. నేను చనిపోయినట్టు ఫీలవుతున్నాను.. చనిపోయిన వాళ్ళనే ఇలా పొగుడుతారంటూ పోస్ట్ చేశాడు. వర్మ చాలామందికి గుర్తింపు తెచ్చారని.. ఆయన శిష్యులు చాలామంది స్టార్‌డైరెక్టర్స్ అయ్యారని కామెంట్స్ పెడుతున్నారు. వర్మ తన తొలి ఆస్కార్‌గా పేర్కొనడం కీరవాణి గొప్పతనమన్నారు.