Vijaya devarakonda saipllavi : రౌడీ స్టార్ కి జోడీగా రౌడీ బేబీ
వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

Mutudumma Sai Pallavi does movies selectively without accepting all the offers.
వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ‘విరాటపర్వం’ (Virataparvam) సినిమా తర్వాత అసలు సినిమాలు చేస్తోందా? లేదా? అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే.. అలాంటి అపొహలన్నీ పటాపంచలు చేస్తూ మళ్లీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీ అవుతోంది ఈ నేచురల్ బ్యూటీ.
ప్రస్తుతం నాగచైతన్యతో (Naga Chaitanya) ‘తండేల్’ (Tandel) సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే సాయిపల్లవి లుక్ బయటకు వచ్చింది. ఈ మూవీలో సత్య అనే అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది సాయిపల్లవి. తమిళంలో శివకార్తికేయన్ కి జోడీగా ‘అమరన్’లో నటిస్తుంది. మరోవైపు హిందీలో రణ్‌బీర్ కపూర్ తో ‘రామాయణ్’, జునైద్ ఖాన్ తో మరో చిత్రంలోనూ నటిస్తుంది సాయిపల్లవి (Sai Pallavi).
ఇక.. తెలుగులో ‘తండేల్’ తర్వాత మరో క్రేజీ మూవీలో నటించబోతుందట సాయిపల్లవి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జోడీ కట్టబోతుందట ఈ రౌడీ బేబీ. విజయ్ దేవరకొండ (Vijaya devarakonda) హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీలో హీరోయిన్ రోల్ కోసం సాయిపల్లవిని సంప్రదించారట. పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఓ.కె. చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.