నా మొగుడు షేవ్ చేసాడు.. వైరల్ అవుతున్న శోభిత ట్వీట్
టాలీవుడ్ న్యూ కపుల్ శోభిత దూలిపాళ్ల.. నాగచైతన్య అక్కినేని.. ఈమధ్య కాస్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. వీళ్లిద్దరి గురించి వస్తున్న న్యూస్ కు మంచి రెస్పాన్స్ ఉండటంతో... జనాలు కూడా అదే రేంజ్ లో చూస్తున్నారు.

టాలీవుడ్ న్యూ కపుల్ శోభిత దూలిపాళ్ల.. నాగచైతన్య అక్కినేని.. ఈమధ్య కాస్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. వీళ్లిద్దరి గురించి వస్తున్న న్యూస్ కు మంచి రెస్పాన్స్ ఉండటంతో… జనాలు కూడా అదే రేంజ్ లో చూస్తున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ పెళ్లి తర్వాత సినిమాలతో బిజీ అయిపోయారు. బాలీవుడ్ లో శోభిత సినిమాలు చేస్తుంటే… తెలుగులో నాగచైతన్య కూడా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ లైన్ చేస్తున్నాడు. ఇక నాగచైతన్య కెరియర్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన తండేల్ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది.
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విషయంలో నాగచైతన్య చాలా కష్టపడ్డాడు. దాదాపు ఈ సినిమా కోసం రెండేళ్ల నుంచి నాగచైతన్య కష్టపడుతున్నాడు. కెరీర్ లో ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేకపోవడంతో, ఈ సినిమాతో ఎలాగైనా సరే ట్రాక్ లోకి రావాలని పట్టుదలగా వర్క్ చేశాడు. ఇక డైరెక్టర్ చందు కూడా ఈ సినిమాపై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టి నాగచైతన్యకు ఎలాగైనా సరే హిట్ ఇవ్వాలన్ని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో శోభిత కూడా నాగచైతన్యకు బాగానే హెల్ప్ చేసింది. డిసెంబర్ లో వీళ్ళిద్దరి వివాహం జరగగా… ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరి గురించి వస్తున్న న్యూస్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక లేటెస్ట్ గా శోభిత.. నాగచైతన్యను ఆకాశానికి ఎత్తేసింది. తండేల్ సినిమా రిలీజ్ సందర్భంగా నాగచైతన్య కు మూవీ టీం కు శోభిత విషెస్ చెప్పింది. ఈ సినిమాపై చైతన్య చాలా ఫోకస్ పెట్టాడని.. చేస్తున్నన్ని రోజులు పాజిటివ్ గా ఉన్నాడని శోభిత కామెంట్ చేసింది.
అలాగే ఫైనల్లి గడ్డం షేవ్ చేశావు.. మొదటిసారి నీ మొహం దర్శనమవుతుంది సామీ అంటూ చైతన్యను ట్యాగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది శోభిత. ఈ సినిమా కోసం చాలా రోజులుగా నాగచైతన్య గడ్డం లుక్ లోనే ఉన్నాడు. పెళ్లి సమయం లో కూడా గడ్డంతోనే కనిపించాడు. చైతు పెళ్లి టైంకి సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అందరు భావించారు. కానీ జనవరిలో కూడా ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ కావడంతో గడ్డం తీయడానికి నాగచైతన్య ఇష్టపడలేదు. ఇక ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా భారీగా వసూలు చేసే అవకాశం ఉందని నిర్మాత అలాగే డైరెక్టర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక నాగచైతన్య కూడా ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో అడుగు పెట్టొచ్చని పట్టుదలగా ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీకి ఇప్పటివరకు 100 కోట్ల సినిమా లేకపోవడం గమనార్హం.