“నాన్నే నా రియల్ హీరో..” బన్నీకి అల్లు అయాన్ క్యూట్ లెటర్
ఇండియా వైడ్‌గా పుష్పగాడి రూలింగ్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ముఖ్యంగా జాతర ఫైట్ సీన్ సినిమా మొత్తానికి ఐకానిక్ సీన్‌గా మిగిలిపోయింది. ప్రతీ చోటా సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వస్తోంది.
ఇండియా వైడ్‌గా పుష్పగాడి రూలింగ్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ముఖ్యంగా జాతర ఫైట్ సీన్ సినిమా మొత్తానికి ఐకానిక్ సీన్‌గా మిగిలిపోయింది. ప్రతీ చోటా సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వస్తోంది. ఇదే క్రమంలో తండ్రి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ బన్నీ కొడుకు అల్లు అయాన్ బన్నీకి ఓ ఎమోషనల్ లేఖ రాశాడు. పుష్ప 2 విడుదలకు ముందు తన తండ్రి అల్లు అర్జున్‌కు తన కష్టాన్ని మర్చిపోయేలా.. తన ప్రేమను తెలియజేస్తూ స్వహస్తాలతో ఓ క్యూట్ లెటర్ రాశాడు అయాన్. కొడుకు రాసిన ఆ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయాడు బన్నీ. “డియన్ నాన్న.. ఈ క్షణంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో.. ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నానో చెప్పేందుకే ఈ లేఖను రాస్తున్నాను.
నీ కష్టం, డెడికేషన్, హార్డ్ వర్క్ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నువ్వు నాకు ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులోనే కనిపిస్తుంటావు. ఈరోజు పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. నీకు ఇప్పుడు ఎలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయో నాకు తెలుసు. నీకు పుష్ప అనేది కేవలం సినిమా కాదు. అదో ప్రయాణం అని నాకు తెలుసు. నటనపట్ల నీకున్న ప్యాషన్‌కు పుష్ప నిదర్శనం. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న.. నువ్వు నాకు నిజమైన హీరోవి నాన్న.. నీకు అనంతమైన అభిమాన గణం ఉంటుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ కదా.. కాదు.. వైల్డ్ ఫైర్.. ఇది ప్రపంచంలోని ఓ ప్రౌడెస్ట్ సన్ బుజ్జి బాబు… ఓ ఐడల్. నాన్నకి ప్రేమతో రాస్తున్న లేఖ” అని అయాన్ తన తండ్రిపై ప్రేమను బయటపెట్టాడు. అయాన్ రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయాడు బన్నీ. ఇక అయాన్ రాసిన లేఖ చూసి ఆశ్చర్యపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. దాదాపు మూడేళ్లుగా పుష్ప 2 కోసం కష్టపడ్డారు సుకుమార్, అల్లు అర్జున్. 2021లో పుష్ప-1తో సంచలనం సృష్టించిన వీరిద్దరి కాంబో.. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి సెన్సెషన్ క్రియేట్ చేసింది.