‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్ నా బిక్ష.. అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్
మెగా అల్లు కుటుంబాల మధ్య రేగిన రచ్చ ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. ఒకప్పుడు పాలలో నీళ్లలా కలిసిపోయిన మెగా అల్లు కుటుంబాలు... ఇప్పుడు మాత్రం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఫైర్ అయిపోతున్నాయి.

ఒకరిపై ఒకరు ఏదో ఒక సందర్భంలో విమర్శలు చేసుకోవడం.. లేదంటే పరోక్ష కామెంట్స్ చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత ఈ పరిణామాలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి సొంతగా పైకి ఎదగాలి అనే టార్గెట్ పెట్టుకున్నాడు.
ఇక అది నచ్చని మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అవసరం లేకుండానే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. రామ్ చరణ్ ను పాన్ ఇండియా హీరో చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు.. మెగా ఫ్యామిలీ పెద్దలు అని కొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ అల్లు అర్జున్ మాత్రం కేవలం సుకుమార్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ విషయంలో అల్లు అరవింద్.. పెద్దరికం ప్రదర్శిస్తారని చాలామంది ఎదురు చూశారు.
కానీ అల్లు అరవింద్ మాత్రం పదేపదే రామ్ చరణ్ టార్గెట్ గా గా అవకాశం దొరికిన ప్రతిసారి.. ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా కూడా మరోసారి ఆయన విమర్శలు చేశారు. ఆయన నిర్మాతగా వచ్చిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజును పక్కన పెట్టుకొని, గేమ్ చేంజర్ కలెక్షన్స్ విషయంలో సెటైర్లు వేశారు. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ ఫస్ట్ మూవీ పై కూడా ఆయన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.
“నా మేనల్లుడు.. రామ్ చరణ్ మొదటి సినిమా వెరీ యావరేజ్ ఫిలిం గా నిలిచిందని… ఆ తర్వాత సినిమాకు తాను నిర్మాతనని, ఆ సినిమాతో రామ్ చరణ్ కి బిగ్ హిట్ ఇచ్చానని మంచి… దర్శకుడ్ని సెలక్ట్ చేసి అంత ఖర్చు పెట్టడానికి అదే ప్రధాన ఉద్దేశం అని, అది నా మేనల్లుడు పై నాకున్న ప్రేమ అంటూ అరవింద్ కామెంట్స్ చేశారు. ఇక దీని మెగా ఫాన్స్ ఫైర్ అయిపోతున్నారు. పాత వీడియోలు తెచ్చి మరి.. అల్లు అరవింద్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ కెరియర్ లో ఫస్ట్ మూవీ చిరుత అప్పట్లో భారీ హిట్ అనే చెప్పాలి.
2007లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా తెలుగు సినిమా పరిశ్రమలో ఎనిమిదవ హైయెస్ట్ గ్రాఫర్ గా అప్పట్లో చిరుత రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు విడుదలైన చాలా సెంటర్స్ లో ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసింది. 9 కోట్ల పెట్టుబడితో వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే 25 కోట్లు కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ తో పోలిస్తే రామ్ చరణ్ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి అప్పట్లో. ఈ సినిమాకు క్రేజ్ కూడా వేరే లెవెల్ లో ఉంది. అలాంటి సినిమాను అల్లు అరవింద్ ఏ విధంగా తక్కువ చేస్తారని ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు.