Nag bunny : నా సామిరంగా కాంబో రిపీట్..!
టాలీవుడ్ (Tollywood) కింగ్ నాగార్జున (King Nagarjuna) లేటెస్ట్ హిట్ మూవీ నా సామి రంగ (Na Sami Ranga).. ఇక.. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంలో నాగ్ ముందుంటారని అందరికీ తెలిసిందే..

My Samiranga combo repeat..!
టాలీవుడ్ (Tollywood) కింగ్ నాగార్జున (King Nagarjuna) లేటెస్ట్ హిట్ మూవీ నా సామి రంగ (Na Sami Ranga).. ఇక.. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంలో నాగ్ ముందుంటారని అందరికీ తెలిసిందే..అందులోనూ నమ్మన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చే విషయంలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. ఇక.. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ (Na SamiRanga) ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించిన ఈమూవీలో అల్లరి నరేష్ (Allari Naresh), రాజ్ తరుణ్ (Raj Tarun) కీలక పాత్రలు పోషించారు. ఇలాంటి టైమ్‌లో నా సామిరంగ కాంబో మరోసారి రిపీట్ కాబోతోందన్న టాక్ టాలీవుడ్ (Tollywood) లో హాట్‌టాపిక్‌గా మారింంది.
ప్రజెంట్ నాగార్జున తమిళంలో కుబేర, కూలి సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సినిమాలను పూర్తి చేసిన తర్వాత నాగ్ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో నటించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది..త్వరలో ఈ కాంబో సినిమాకు సంబంధించి ఆధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. మరొక్కసారి విజయ్ బిన్నీతో నాగ్ నటించబోయే ఈ మూవీ మరొక మాస్ యాక్షన్ మూవీగా రెడీ అవుతోందంటూ లేటెస్ట్ టాలీవుడ్ బజ్ వినిపిస్తోంది. కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ బిన్నీ దర్శకుడిగా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇక.. విజయ్ బిన్నీ తర్వాత సినిమాకు సొంత కథను ఎంచుకుంటారో లేదా రీమేక్ మూవీపై ఆధారపడతారో తెలియాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్వరలో అనౌన్స్ కానున్న ఈ మూవీని వేగంగా షూటింగ్ పూర్తి చేసి రానున్న 2025 సంక్రాంతి (2025 Sankranti) బరిలో నిలపాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా అతిత్వరలో ఈ క్రేజీ మూవీ గురించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగార్జున స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.