RAM CHARAN: మెగా కిక్కు.. లియో మూవీలో రామ్ చరణ్ సర్‌ప్రైజ్?
లియోలో చరణ్ గెస్ట్ రోల్ అంటూ రెండు మూడు రోజులుగా ఒకటే గుసగుసలు పెరిగాయి. విక్రమ్ మూవీ వచ్చినప్పుడు కూడా ఇంతే. సూర్యా గెస్ట్ రోల్ వేశాడని విడుదల రోజు వరకు పెద్దగా రివీల్ చేయలేదు. ఇలానే లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రామ్ చరణ్ గెస్ట్ రోల్ వేసిన విషయాన్ని దాస్తున్నాడంటున్నారు.

RAM CHARAN: ఖైదీ, విక్రమ్ లాంటి మూవీలు తీసిన లోకేష్ కనకరాజ్ మేకింగ్‌లో వస్తున్న సినిమా అంటే అదే రేంజ్‌లో అంచనాలుంటాయి. అలా హైప్ తెచ్చుకున్న లియో అంచనాలను మరింత పెంచుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. లియోలో చరణ్ గెస్ట్ రోల్ అంటూ రెండు మూడు రోజులుగా ఒకటే గుసగుసలు పెరిగాయి. విక్రమ్ మూవీ వచ్చినప్పుడు కూడా ఇంతే. సూర్యా గెస్ట్ రోల్ వేశాడని విడుదల రోజు వరకు పెద్దగా రివీల్ చేయలేదు. ఇలానే లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రామ్ చరణ్ గెస్ట్ రోల్ వేసిన విషయాన్ని దాస్తున్నాడంటున్నారు.
ఇదొక్కటే కాదు శంకర్ మేకింగ్‌లో చరణ్ చేస్తున్న సినిమా తాలూకు అప్‌డేట్ కూడా మెగా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా ఉంది. భారతీయుడు 2 తాలూకు డబ్బింగ్ పనులుమొదలయ్యాయి. కమల్ హాసన్ కూడా తన పాత్ర తాలూకు డబ్బింగ్ పనులు మొదలు పెట్టాడు. అంటే భారతీయుడు 2 షూటింగ్ పూర్తైనట్టేకదా. సో ప్యాచ్ వర్క్ వదిలేస్తే భారతీయుడు 2 పూర్తయినట్టే అనటంతో, ఇక గేమ్ ఛేంజర్‌ని పూర్తి చేయటంలో బిజీ అవబోతున్నాడు శంకర్. ఇలా చరణ్ మూవీ షూటింగ్ వేగంగా పూర్తయ్యే టైం వస్తున్నప్పుడు, లియోలో చరణ్ గెస్ట్ రోల్ అనగానే సినీజనాల్లో ఊపొస్తోంది. ఐతే లోకేష్ కనకరాజ్ లియో తర్వాత చరణ్‌తో మూవీ ప్లాన్ చేసుకున్నాడు. కాని రజనీకాంత్ కోరిక మేరకు ఆ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్నాడట.
దీనికి కూడా కారణం రామ్ చరణే. తను బుచ్చిబాబు మూవీ, అలానే హిందీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ మేకింగ్‌లో మరో సినిమా కమిటవ్వటంతో లోకేష్ ప్రాజెక్ట్‌ని వాయిదా వేశాడట. అందుకే అటు రజినీ, ఆ తర్వాత ఖైదీ సీక్వెల్ ప్లాన్ చేసుకుంటున్నాడు లోకేష్. ఐతే లియోలో చరణ్ పాత్రనుపెట్టి, తనతో తీయబోయే సినిమాకు లింక్ పెట్టేలా సీన్ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 19న విడుదలయ్యాకే ఇదెంత వరకు నిజమో తేలబోతోంది.