Pawan Kalyan : నా ఉసురు తగులుతుంది.. పవన్ ఫ్యాన్స్‌ను ఏకిపారేసిన రేణూ
పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తంలో డిప్యుటీ సీఎం అయ్యాడో కానీ అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్‌కు రేణూ దేశాయ్‌కి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.

Naa Usuru will hit.. Renu who united Pawan's fans
పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తంలో డిప్యుటీ సీఎం అయ్యాడో కానీ అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్‌కు రేణూ దేశాయ్‌కి మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. పవన్ డెప్యుటీ సీఎం అయ్యాక రేణూ దేశాయ్ పోస్టులకు కొందరు పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారు. పవన్‌ను వదిలేసి చాలా పెద్ద తప్పు చేశారు అంటూ చెప్పారు. అయితే ఈ కామెంట్స్‌కు రేణూ దేశాయ్ స్పందించారు. తాను పవన్‌ను వదిలేయలేదని.. పవన్ కళ్యాణే వేరే అమ్మాయి కోసం తనను వదిలేశాడని చెప్పారు.
ఇది జరిగి చాలా రోజులైనా ఈ కామెంట్ల వర్షం మాత్రం ఇంకా ఆగలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ కామెంట్స్, రేణూ దుశాయ్ కూతురు ఆధ్య కన్నీరు పెట్టుకుందట. దీంతో కడుపు మండిన రేణూ మరోసారి పవన్ ఫ్యాన్స్‌ను సోషల్ మీడియాలో ఏకి పారేశారు. ఎవరికి వాళ్లు వాళ్ల పర్సనలైఫ్ చూసుకోకుండా తన మీద ఎందుకు పడుతున్నారంటూ సీరియస్ అయ్యారు. ఇలాంటి కామెంట్స్ పెట్టేవాళ్లు ట్రోలింగ్స్ చేసేవాళ్లకు కుటుంబాలు లేవా అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశారు. ఎందుకు ఇలా తనను టార్గెట్ చేసిన తన పిల్లలకు ప్రశాంత లేకుండా చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.
దీంతో మరోసారి ఈ పోస్ట్‌ల వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానం ఉంటే హీరో మీద చూపించాలి గానీ ఇలా మహిలను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కూడా రేణూకు మద్దతు తెలుపుతున్నారు.