Project K: నాగ్ అశ్విన్ మరో రాజమౌళి.. ప్రాజెక్టు కేపై లీకులు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే

వారానికో అప్‍డేట్‌తో ప్రాజెక్ట్ కే టీం షాక్ ఇస్తోంది. వరుసగా పోస్టర్, మేకింగ్ వీడియోలు, అందులో విలన్ డ్రెస్సులకు సంబంధించిన అప్‍డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ గురించి లీక్స్ ఇచ్చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2023 | 04:59 PMLast Updated on: Apr 14, 2023 | 4:59 PM

Nag Ashwin Giving Updates About Project K Like Rajamouli

Project K: ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ నిరుత్సాహపరిచాడు. సలార్ అప్‌డేట్స్ ఇవ్వకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. వాళ్లతో పోలిస్తే ప్రాజెక్ట్ కే తీస్తున్న నాగ్ అశ్విన్ మాత్రం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగ తెస్తున్నాడు. వారానికో అప్‍డేట్‌తో ప్రాజెక్ట్ కే టీం షాక్ ఇస్తోంది.

వరుసగా పోస్టర్, మేకింగ్ వీడియోలు, అందులో విలన్ డ్రెస్సులకు సంబంధించిన అప్‍డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ గురించి లీక్స్ ఇచ్చేస్తున్నాడు. ఇలా వారానికో కొత్త అప్‍డేట్‌తో నాగ్ అశ్విన్ యాజ్ ఇట్ ఈజ్ రాజమౌళిని ఫాలో అవుతున్నాడు. ప్రాజెక్ట్ కే రావటానికి ఇంకా 8 నెలల టైం ఉంది. సంక్రాంతికి వచ్చే సినిమా గురించి.. మెల్లిగా లీకులిస్తోంది చిత్ర యూనిట్. ప్రాజెక్ట్ కే అంటే కల్కి, క్రిష్ణ, కర్ణ అంటూ ఊహాగానాలు వచ్చేలా లీకులు ఇస్తోంది ఫిల్మ్ టీం.

ఇక వేరే గ్రహంలో ల్యాండ్ అయ్యే కర్ణుడి కథని కొద్ది కొద్దిగా జనాల్లోకి వదులుతోంది చిత్ర యూనిట్. ఇదంతా కావాలనే చేస్తున్న ఫీలర్స్ మాయాజాలమని తెలుస్తోంది. ఏదైతేనేం.. ఫ్యాన్స్‌కు మాత్రం పండుగ తెస్తోంది ప్రాజెక్ట్ కే టీం. ఆదిపురుష్ రిలీజ్‌కి ఇంకా 2 నెలలే టైం ఉంది. కాని నో అప్‍డేట్స్. నాలుగన్నర నెలల తర్వాత వచ్చే సలార్ మూవీకి సంబంధించి అప్‍డేట్స్ లేవు. కాని ప్రాజెక్ట్ కే తాలూకు అప్ డేట్లు, గుసగుసలు మాత్రం వస్తూనే ఉన్నాయి.