Kalki : ప్రభాస్ మీద వర్మ ఎటాక్..?
రాజమౌళిని ఓ సైంటిస్ట్ గా, రామ్ గోపాల్ వర్మని సినిమా దర్శకుడిగా కల్కీలో చూపించబోతున్నాడట నాగ్అశ్విన్.

Nag Ashwins movie Kalki 2898 with Prabhas should come on Sankranti Naga Ashwin gave guest roles to Rajamouli and Ram Gopal Varma Kamal Haasan joined in the climax scenes
ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీస్తున్న మూవీ కల్కీ 2898 ఈ సినిమా సంక్రాంతికి రావాలి. కాని రెండు భాగాలుగా ప్లాన్ చేయటంతో, కొత్త పాత్రల ఎంట్రీతో సమ్మర్ కి విడుదల షిఫ్ట్ అయ్యింది. కమల్ హాసన్ క్లైమాక్స్ సీన్స్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు రాజమౌలితో పాటు రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఎంట్రీ ఇస్తున్నాడు.
రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కి గెస్ట్ రోల్స్ ఇచ్చిన నాగ అశ్విన్.
నిజంగానే వివాదాల వర్మకి నాగ్ అశ్విన్ వెల్ కమ్ చెప్పాడా? ఎందుకు నాగ్ అశ్విన్ అండ్ కో
రాజమౌళి, రామ్ గోపాల్ వర్మలను గెస్ట్ లుగా తీసుకుంటున్నారు? ఇలాంటి డౌట్లే పెరిగిపోతున్నాయి. రాజమౌళిని ఓ సైంటిస్ట్ గా రామ్ గోపాల్ వర్మని సినిమా దర్శకుడిగా కల్కీలో చూపించబోతున్నాడట నాగ్అశ్విన్.. ఇలానే బయట ప్రచారాలు జరుగుతున్నాయి.
కల్కీ మూవీలో రామ్ గోపాల్ వర్మ స్పెషల్ అప్పియరెన్స్?
విచిత్రం ఏంటంటే కల్కీలో ఓ సినిమా షూటింగ్ సీన్ ఉంటుందని, ఆ సీన్ లో నిజంగా హీరో సూపర్ పవర్స్ తో వస్తే, తన పెర్పామెన్స్ బాలేదని తిట్టే రోల్ లో రామ్ గోపాల్ వర్మ కనిపిస్తాడని గుసగుసలు పెరిగాయి. మరి ఇవన్నీ నిజాలేనా, పుకార్లో ఫిల్మ్ టీం తేల్చట్లేదు. కనీసం ఖండించట్లేదు. కాని బయటి వచ్చే గుసగుసల గోల మాత్రం ఆగట్లేదు.
మహానటి సినిమాలోలానే దర్శకులకి అలాంటి పాత్రలొచ్చాయా?
నిజానికి రాజమౌలి, వర్మ ఇద్దరి గెస్ట్ అప్పియరెన్స్ నిజమనుకోవటానికి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి.
మహానటిలో సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, క్రిష్ ఇలా చాలా మంది తోటి దర్శకులని తన సినిమాలో గెస్ట్ రోల్ వేయించాడు. కేవీ రెడ్డినుంచి సింగీతం వరకు దర్శకుల పాత్రల్లో దర్శకులని చూపించాడు. కాబట్టే కల్కీలో వర్మ, రాజమౌళి కనిపిస్తున్నారంటే నమ్మాల్సి వస్తోంది.