Samantha Ruth Prabhu: వరుణ్, లావణ్య పెళ్లికి హాజరుకానున్న సమంత, నాగ చైతన్య..!
ఈ పెళ్లికి వరుణ్ ఫ్రెండ్ నాగచైతన్యతో పాటు సమంత కూడా హాజరుకాబోతోందట. ఇప్పటికే నాగ చైతన్య, సమంత ఇద్దరూ వేరువేరుగా ఇటలీ బయల్దేరినట్టు తెలుస్తోంది.

Samantha Ruth Prabhu: చాలా కాలం పాటు తమ ప్రేమను సీక్రెట్‌గా ఉంచిన లవ్ పెయిర్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలెక్కబోతున్నారు. బుధవారం ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్‌గా జరగబోతోంది. కేవలం కుటుంబ సభ్యులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకకు హాజరవుతున్నారు. ఇప్పటికే కొణిదెల కుటుంబ సభ్యులతో పాటు లావణ్య ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కూడా ఇటలీకి చేరుకున్నారు. అంతరిక్షం సినిమా టైంలో ఇటలీలోనే వరుణ్, లావణ్య ప్రేమలో పడ్డారట.
అందుకే వాళ్ల ప్రేమ జీవితం మొదలైన ఇటలీలోనే పెళ్లి జీవితం కూడా ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. ఈ వేడుక రేపు ఇటలీలో గ్రాండ్‌గా జరగబోతోంది. అయితే ఈ పెళ్లికి వరుణ్ ఫ్రెండ్ నాగచైతన్యతో పాటు సమంత కూడా హాజరుకాబోతోందట. ఇప్పటికే నాగ చైతన్య, సమంత ఇద్దరూ వేరువేరుగా ఇటలీ బయల్దేరినట్టు తెలుస్తోంది. ఇది నిజమైతే వరుణ్, లావణ్య పెళ్లిలో సామ్, చైతూ మళ్లీ ఎదురుకాబోతున్నారన్నమాట. వీళ్లిద్దరూ విడిపోయిన దగ్గర్నించి కలిసి కనిపించిన ఈవెంట్స్ లేవు. ఏ ఈవెంట్‌కి ఇద్దరూ హాజరు కాలేదు.
మొదటిసారి వరుణ్ పెళ్లి వీళ్ల మీటింగ్‌కు వేదిక కాబోతోంది. దీంతో మ్యూచువల్ ఫ్యాన్స్‌కే కాకుండా వీళ్ల లవ్ బ్రేకప్ స్టోరీని ఫాలో అయినవాళ్లు ఈ మూమెంట్ కోసం చాలా ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నారు. చూసేందుకు ఆడియన్స్‌కు ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నా.. ఒకసారి బ్రేక్ అయిన తరువాత మళ్లీ అదే పర్సన్‌ని కలవడం అంటే చాలా కష్టమైన మూమెంట్. ఇదే ఆలోచనతో వీళ్లు ఆ పెళ్లిలో కలుసుకుంటారా.. లేక చివరి నిమిషంలో వెళ్లడం ఇష్టం లేక ఆగిపోతారా అన్నది చూడాలి.