Samantha Naga chaythana : ఒకే వేదికపై నాగచైతన్య, సమంత!
టాలీవుడ్ (Tollywood) లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సమంత (Samantha) లకు సంబంధించి ఎలాంటి పర్సల్ అప్‌డేట్ వచ్చినా దాని గురించి తెలుసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటగా ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో వీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది.

Naga Chaitanya and Samantha on the same stage!
టాలీవుడ్ (Tollywood) లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సమంత (Samantha) లకు సంబంధించి ఎలాంటి పర్సల్ అప్‌డేట్ వచ్చినా దాని గురించి తెలుసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటగా ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో వీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. 2017లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2021లో కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని ఎవరి లైఫ్‌ను వారు లీడ్ చేస్తున్నారు. అయితే నాగచైతన్య అయినా, సమంత అయినా పర్సనల్‌గా ఏదైనా పోస్ట్ చేసినా, కామెంట్ చేసినా అది వైరల్‌గా మారడం మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ మళ్లీ కలుసుకోబోతున్నారా అనే వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదికను షేర్ చేసుకోవాల్సి వచ్చింది. సమంత సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. వాస్తవారికి అమెరికాకు చెందిన సిటాడెల్ వెబ్‌సిరీస్‌ని ఇండియన్ వెబ్‌సిరీస్‌గా రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్‌సిరీస్‌కి సంబంధించిన ఒక ఈవెంట్‌ను ముంబాయిలో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సిరీస్‌కి ‘హనీ బన్నీ’ అనే టైటిల్ ఎనౌన్స్ చేసేందుకు గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌కి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. వారిలో అక్కినేని నాగచైతన్య కూడా ఉన్నాడు. నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత ఇద్దరూ కలుసుకున్నది లేదు. అదీగాక ఈ ఈవెంట్‌లో ఒకే వేదికను ఇద్దరూ షేర్ చేసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వేదికపై ఇద్దరూ కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరచింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.