సమంత ప్రపోజ్‌ చేసిన రోజే శోభితతో ఎంగేజ్‌మెంట్‌

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 8, 2024 | 08:14 PMLast Updated on: Aug 08, 2024 | 8:14 PM

Naga Chaitanya Engagement On Samantha Samantha Love Proposal Date

ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌ గురించే చర్చ. వీళ్ల లవ్‌ గురించి చాలా రోజుల నుంచి రూమర్స్‌ ఉన్నా.. ఎలాంటి యాక్షన్‌ రియాక్షన్‌ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఎంగేజ్‌మెంట్‌తో సమాధానం చెప్పడంతో ఫ్యాన్స్‌ ఒకింత ఆనందంలో ఒకింత షాక్‌లో ఉన్నారు. హీరో నాగార్జున ఇంట్లో చాలా సింపుల్‌గా కొద్ద మంది గెస్ట్‌ల సమక్షంలో నాగ చైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి డేట్‌ కూడా అనౌన్స్‌ చేస్తామని నాగార్జున చెప్పారు. దీంతో వీళ్లకు కంగ్రాట్స్‌ చెప్తూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదే క్రమంలో ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌ ఇప్పడు వైరల్‌గా మారింది. ఆగస్ట్‌ 8 నాగ చైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్‌ జరిగిన డేట్‌. సమంత నాగ చైతన్యకు ప్రపోజ్‌ చేసిన డేట్‌ కూడా ఇదే అంటూ కామెంట్‌ పెట్టాడు ఓ నెటిజన్‌. ఏమాయ చేశావే సినిమా సమయంలో వీళ్లిద్దరి మధ్య లవ్‌ మొదలయ్యింది. ఆ సినిమా రిలీజ్‌ అయ్యాక ఆగస్ట్‌ 8నే సమంత చైతన్యకు లవ్‌ ప్రపోజ్‌ చేసింది. ఇప్పుడు అదే డేట్‌కి చైతన్య వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు అని పోస్ట్‌ చేశాడు. చైతన్య ఇంకా సమంతను మర్చిపోలేదు కాబట్టే తన స్పెషల్ డేట్‌ రోజు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అంటూ పోస్ట్‌ చేశాడు. నిజంగా ఆగస్ట్‌ 8నే సామ్‌ చైతన్యకు ప్రపోజ్‌ చేసిందా లేదా అనే విషయం కంటే ఈ పోస్ట్‌ ఇప్పుడు ఎక్కువగా వైరల్‌ అవుతోంది. దాంతో పాటే ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. శోభిత చైతూ ఎంగేజ్‌మెంట్‌ డేట్‌, మంత్‌, సమ్‌ ఆఫ్‌ ఇయర్‌ని కాలిక్యులేట్‌ చేస్తే వచ్చే నెంబర్‌ 888. ఈ నెంబర్‌ చాలా ప్రత్యేకమైన నెంబర్‌ అని కూడా చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు.