శోభితాకు అన్నీ తెలుసు, తన లైఫ్‌పై చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ లో నాగచైతన్య శోభిత దూళిపాళ్ల వివాహం ఒక సెన్సేషన్. వీళ్ళిద్దరి పెళ్లి గురించి మీడియా చేసిన హడావుడి అంత ఇంత కాదు. సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్.
టాలీవుడ్ లో నాగచైతన్య శోభిత దూళిపాళ్ల వివాహం ఒక సెన్సేషన్. వీళ్ళిద్దరి పెళ్లి గురించి మీడియా చేసిన హడావుడి అంత ఇంత కాదు. సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్. ఇక సమంత ఫ్యాన్స్ అయితే నాగచైతన్య కంటే శోభితాను ఎక్కువగా తిట్టడం మొదలుపెట్టారు. శోభిత కారణంగానే సమంతకు నాగచైతన్య అన్యాయం చేశాడని నాగచైతన్యను శోభిత ట్రాప్ చేసిందంటూ చాలామంది సోషల్ మీడియాలో ఇబ్బందికర కామెంట్స్ పెట్టారు.
అసలు శోభిత కారణంగానే నాగచైతన్యకు సమంత దూరమైందని కొంతమంది ముందు నుంచి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఆ కామెంట్స్ నిజం చేస్తూ వీళ్లిద్దరూ డిసెంబర్లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత గ్రాండ్గా జరిగిన ఈ వివాహానికి సినిమా ప్రముఖులందరూ హాజరయ్యారు. ఇక వివాహం చేసుకొని వీళ్ళిద్దరూ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు అని ప్రచారం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శోభిత పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి.
తాజాగా శోభితపై నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను అన్ని విషయాలను ఎంతో సంతోషంగా శోభితతో పంచుకుంటానంటూ కామెంట్ చేశాడు. చాలా విషయాల్లో తాను కన్ఫ్యూజింగ్ గా ఉన్నప్పుడు శోభితా తనకు ఎంతో సపోర్ట్ చేస్తుందని సరేనా ఐడియాస్ ఇస్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాగే శోభితతో జీవితాన్ని షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం తనకు ఇష్టమని తన ఆలోచనలు అన్నింటిని ఆమెతో చెబుతుంటా అని ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టాడు.
తాను ఎప్పుడైనా గందరగోళానికి లోనైనప్పుడు వెంటనే ఆమెను కాంటాక్ట్ చేస్తానని తాను ప్రెజర్ లో ఉన్నప్పుడు శోభితకు తెలిసిపోతుంది అని కామెంట్ చేశాడు. ఏమైంది ఎందుకలా ఉన్నావ్ అని అడుగుతుందని అన్ని విషయాల్లో తను చాలా గొప్ప సలహాలు సూచనలు ఇస్తుంటుందని ఆమె అభిప్రాయాలు ఎంతో పక్కాగా ఉంటాయన్నాడు. ప్రతి ఒకటి ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందుకు అడుగు వేస్తాననీ చెప్పుకొచ్చాడు చైతన్య. ఇక శోభిత కూడా నాగచైతన్య గురించి ఎన్నో విషయాల్లో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తాను ముంబైలో ఉంటే చైతన్య హైదరాబాదులో ఉండేవాడని తనకోసం హైదరాబాదు నుంచి ముంబై వచ్చేవాడని మొదటిసారి మేమిద్దరం బయటికి వెళ్ళినప్పుడు చైతన్య సూట్ లో ఉంటే తాను రెడ్ డ్రస్ లో ఉన్నా అని.. ఆ తర్వాత కర్ణాటకలోని ఒక పార్కు వెళ్ళామని అక్కడ కొంత సమయం గడిపామని ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకున్నామని చెప్పుకొచ్చింది.