Naga Chaitanya: శోభిత ధూళిపాలతో నాగచైతన్య ఏడడుగులు?
అసలు ఇండస్ట్రీ అమ్మాయినే నాగచైతన్య పెళ్లిచేసుకోడని, అక్కినేని ఫ్యామిలీ బయటి సంబంధాలు చూస్తున్నారని పుకార్లొచ్చాయి. ఇంతలో ఎట్టి పరిస్తితుల్లో నాగచైతన్య పెళ్లి చేసుకునేది ఇండస్ట్రీలోని వ్యక్తినే అంటూ మరో ప్రచారం తాజాగా ఊపందుకుంది.

Naga Chaitanya: నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి. మధ్యలో శోభితా ధూళిపాలతో చైతన్య పెళ్లి అన్నారు. డేటింగ్ అన్నారు. తీరా చూస్తే అవేం లేనట్టుందే అనుకునేలోపు.. ఈ ఏడాదే ఈ ఇద్దరు ఏడడుగులు నడవబోతున్నారంటున్నారు. కానీ, అసలు ఇండస్ట్రీ అమ్మాయినే నాగచైతన్య పెళ్లిచేసుకోడని, అక్కినేని ఫ్యామిలీ బయటి సంబంధాలు చూస్తున్నారని పుకార్లొచ్చాయి. ఇంతలో ఎట్టి పరిస్తితుల్లో నాగచైతన్య పెళ్లి చేసుకునేది ఇండస్ట్రీలోని వ్యక్తినే అంటూ మరో ప్రచారం తాజాగా ఊపందుకుంది.
ఒక మ్యాగజైన్ కవర్ స్టోరీలో ఈ వివరాల గురించి ప్రచురితమైంది. త్వరలోనే శోభిత, నాగ చైతన్య ఇద్దరూ తమ డేటింగ్ గురించి, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి అఫీషియల్‌గా ఎనౌన్స్ చేస్తారనే వార్తొచ్చింది. అంతా బాగానే ఉంది. కాని శోభిత, నాగచైతన్య ఎందుకు ఈ సాగతీత వ్యవహరాన్ని నడిపిస్తున్నారనే కామెంట్లే పెరిగాయి. అయితే ఓ వైపు సమంత హెల్త్ ఇష్యూతో ఫైట్ చేస్తుంటే, ఇప్పుడు ఎనౌన్స్ మెంట్లు బాగుండవనేది నాగచైతన్య అభిప్రాయమట. అందుకే దసరా తర్వాత ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.