2 రోజుల్లో 41 కోట్లు.. వారం రోజుల్లో 140 కోట్లు.. తండేల్ కాసుల వర్షం
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి.. డైరెక్షన్లో వచ్చిన తండెల్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. యూత్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ గా కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి.. డైరెక్షన్లో వచ్చిన తండెల్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. యూత్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ గా కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటించిన కూడా సినిమాకు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. దానికి తోడు ఈ మధ్యకాలంలో రియల్ లైఫ్ లో జరిగిన ఘటనలపై జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇలాంటి సినిమాలుకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. నిర్మాత అల్లు అరవింద్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్లాన్ చేసుకున్నారు.
ఇక దాదాపు ఈ సినిమా కోసం మూవీ యూనిట్ మొత్తం రెండేళ్ల నుంచి కష్టపడుతోంది. కథలో బలం ఉండటంతో నాగచైతన్య కూడా ప్రాణం పెట్టి వర్క్ చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతోంది.. అమెరికాలో దాదాపుగా ఇప్పటికే ఐదు లక్షల డాలర్లు ఈ సినిమా వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రిలీజ్ కు ముందే దాదాపు రెండు లక్షల డాలర్లు ఈ సినిమా అక్కడ కలెక్ట్ చేసింది.
ఇక మొదటి రోజు 21 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండో రోజు కూడా సెన్సేషనల్ బుకింగ్స్ తో దుమ్ము రేపుతుంది. వీకెండ్ కావడంతో రెండో రోజు కూడా 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అందుకుని ఈ రెండు రోజుల్లో మొత్తం 41 కోట్ల 20 లక్షలు వసూలు చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో ఈ సినిమా లాంగ్ రన్ లో 150 కోట్ల వరకు వసూలు చేయొచ్చని సినిమా మేకర్స్ అంచనా వేస్తున్నారు. అటు తమిళంలో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. తమిళ సినిమాకు దగ్గరగా ఉండే ఈ సినిమా అక్కడి ఆడియన్స్ కు కూడా బాగా నచ్చేసింది. దానికి తోడు తమిళంలో సాయి పల్లవి ఉండటం బాగా అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి.
ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన క్లాసిక్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు అడ్వాంటేజ్. సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా నాగచైతన్య అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఈ సినిమా.. ఖచ్చితంగా ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి 100 కోట్ల సినిమా లేదు. దీనితో నాగచైతన్య డ్రీమ్ కచ్చితంగా కంప్లీట్ చేస్తాడని అక్కినేని ఫ్యామిలీ కూడా హోప్స్ పెట్టుకుంది. ఇక పర్సనల్ లైఫ్ లో దాదాపు రెండు మూడేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకు ఈ సినిమా ఖచ్చితంగా మంచి ఎనర్జీ ఇచ్చింది.