Naga Chaithanya : సమంతను బెదిరించిన నాగచైతన్య…

అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈపాటికే నాగ చైతన్య, సమంత తల్లిదండ్రులు అయి ఉండేవారు. కానీ అలా జరగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్, చై ఇద్దరు కొన్నాళ్లకే విడిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2024 | 11:38 AMLast Updated on: Apr 14, 2024 | 11:38 AM

Naga Chaitanya Threatened Samantha

అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈపాటికే నాగ చైతన్య, సమంత తల్లిదండ్రులు అయి ఉండేవారు. కానీ అలా జరగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్, చై ఇద్దరు కొన్నాళ్లకే విడిపోయారు. కారణాలు ఏమైనా.. ఈ విషయంలో అటు సమంత ఫ్యాన్స్, అక్కినేని అభిమానులు చాలా బాధపడ్డారు. ఇక డివోర్స్ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు ఇద్దరు. కాకపోతే సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేజ్ చేస్తోంది. ఈ మధ్యే తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అయింది. ప్రస్తుతం సమంత సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

మరోవైపు నాగ చైతన్య మంచి హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఇద్దరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అలా అని ఈ ఇద్దరికి సంబంధించిన వార్తలు మాత్రం తగ్గవు. లేట్‌ అయినా లేటెస్ట్‌గా సామ్‌ని చై బెదిరించాడనే న్యూస్ వైరల్‌గా మారింది. జనరల్‌గా ప్రేమికుల మధ్యన గొడవలు కామన్. ఇందుకు సమంత, చైతన్య కూడా అతీతం కాదు. ఈ ఇద్దరు పీకల్లో ప్రేమలో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగేవట. ఎలాగూ ఆ తర్వాత సారీ చెప్పుకోవడం.. మళ్లీ కలుసుకోవడం కామన్. అయితే.. ఓ విషయంలో నాగ చైతన్యతో సమంత గట్టిగానే గొడవ పడిందట.

కొన్ని రోజులు ఇద్దరి మధ్య మాటలు కూడా లేవట. దీంతో నాగ చైతన్య, సమంతకు మెసేజ్ చేస్తూ ఇలా బెదిరించేవాడట. ఇప్పుడు నువ్వు నాతో ఫోన్ చేసి మాట్లాడకపోతే.. మన ప్రేమ విషయాన్ని అందరికి చెప్పేస్తానంటూ బెదిరించాడట. దీంతో భయపడిపోయిన సమంత.. ఎవరికి చెప్పకు అంటూ ఫోన్ చేసేదట. అలా ఈ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవట. ఏదేమైనా.. ఇప్పుడు ఇద్దరికీ ఇలాంటి మెమోరీస్ గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తారో ఏమో