Naga Chaitanya: మాస్ గెటప్.. పుష్ప లుక్‌లో నాగ చైతన్య

ఈ సినిమా షూటింగ్ పిక్ లీక్ అయి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నాగ చైతన్య లుక్ చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 08:25 PMLast Updated on: Dec 21, 2023 | 8:25 PM

Naga Chaitanyas Look From Thandel Leaked Fans Are Impressive

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం తండేల్‌. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియోలో నాగ చైతన్య.. పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్‌లాంటి లుక్‌‌లో ఉండటంతో అక్కినేని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

SALAAR REVIEW: సలార్‌ ఫస్ట్‌ రివ్యూ.. అరాచకానికి అర్థం చెప్పారు..

ప్రి ప్రొడక్షన్ పనుల కోసం టీమ్ చాలా సమయం, శ్రమను వెచ్చించి ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా షూటింగ్ పిక్ లీక్ అయి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నాగ చైతన్య లుక్ చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. నాగచైతన్య లుక్ బయటకు రాగానే నెటిజన్లు అల్లు అర్జున్ పుష్పతో పోల్చడం ప్రారంభించారు. నాగ చైతన్య తన గెటప్‌లో పల్లెటూరి యువకుడిలాగా కనిపిస్తున్నాడు. చై కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఇది రానుంది. ఈ మూవీలో జాలరి పాత్రలో నటిస్తున్నాడు. తొలి షెడ్యూల్‌ను కర్ణాటక, గోవాలో ప్లాన్ చేశారు.

మొదటి రోజే సెట్స్‌లోకి జాయిన్ అయ్యాడు నాగ చైతన్య. త్వరలో సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం చేయకూడదని భావించిన టీమ్ షూటింగ్ షెడ్యూల్స్‌ని స్పష్టంగా ప్లాన్ చేసింది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్లలోనే జరగనుంది. తండేల్ పూర్తిగా భిన్నమైన నేపథ్యంతో కూడిన ప్రేమకథ. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.