నాగ సాధువు vs అఘోరా… ఫస్ట్ టైం విలన్ గా…

నటసింహం బాలయ్య పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్న మూవీ అఖండ 2. బోయపాటి శీను మేకింగ్ లో సెట్స్ పైకెళుతున్న ఈప్రాజెక్ట్ రిలీజ్ కి ముందే నార్త్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కుంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2025 | 09:00 PMLast Updated on: Feb 12, 2025 | 9:00 PM

Naga Sadhu Vs Aghora As A First Time Villain

నటసింహం బాలయ్య పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్న మూవీ అఖండ 2. బోయపాటి శీను మేకింగ్ లో సెట్స్ పైకెళుతున్న ఈప్రాజెక్ట్ రిలీజ్ కి ముందే నార్త్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కుంటోంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అఖండ తెలుగులోనే హిట్ అయినా, హిందీ డబ్ వర్షణ్ యూట్యూబ్ ని కుదిపేసింది. అందులో అఘోరా కాన్సెప్ట్ ఉత్తారాదిని ఊపేసింది. ప్రజెంట్ నార్త్ ఇండియాలో మహాకుంభమేళా జరుగుతోంది. కాబ్టటి, అఖండ 2 లో అఘోరాతో పాటు నాగ సాధువు కాన్సెప్ట్ యాడ్ చేయటం వల్ల… అలా కూడా నార్త్ ఇండియాని ఈ సినిమా షేక్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే రిలీజ్ కి ముందే 500 కోట్ల వరకు డిల్ సెట్ అయ్యేలా ఉంది. ఓటీటీ, శాటిలైట్, హిందీ థియేట్రికల్ రైట్స్ మీద డిస్కర్షన్ జరుగుతోంది. ఇలాంటి టైంలో బాలయ్య నెగెటీవ్ రోల్ వేయబోతున్నాడన్న ప్రచారం షురూ అయ్యింది. తన కెరీర్ లోనే ఫస్ట్ టైం నటసింహం బాలయ్య విలన్ రోల్ వేయబోతున్నాడు. వార్ 2 తో ఎన్టీఆర్ విలన్ గా మారుతుంటే, అబ్బాయ్ రూట్లోనే బాబాయ్ నెగెటీవ్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. కాకపోతే ఇక్కడ హీరో బాలయ్యే, విలన్ కూడా బాలయ్యే అంటున్నారు… నిజమేనా..? హావేలుక్

నటసింహం బాలయ్య అఘోరాగా వస్తేనే, జీరో ప్రమోషన్ తో కూడా అఖండ దుమ్ముదులిపింది. అఘోరా పాత్ర ఇక్కడ డైలాగ్ విసిరితే, నార్త్ ఇండియాలో రీసౌండ్ వచ్చింది. అసలు అఖండని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే రికార్డులు బద్దలయ్యేవి కాని, తెలుగుకే పరిమితం చేసి, ఆతర్వాత హిందీ డబ్ వర్షన్ ని యూ ట్యూబ్ లో పెట్టారు. ఇప్పుడు అఖండ 2 ని మాత్రం పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు

అయితే బేసిగ్గానార్త్ ఇండియన్స్ కి సౌత్ సినిమాలు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలంటే క్రేజ్ పెరుగుతోంది. కారణం కంటెంట్ తో పాటు, కల్చర్ ని సనాతన ధర్మాన్ని చూపించే విదానానికి వాళ్లు ఫిదా అయ్యారు. అలాంటి టైంలో అఖండ వస్తే సునామీనే.. కాని తెలుగులోనే వచ్చింది. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కోసం అఖండ 2 ని హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించబోతున్నారు

అది కూడా అఘోరా పాత్రకి, మరో పాత్ర నాగ సాధువుని జోడించి… నిజంగానే ఇది జరగబోతోంది. నటసింహం బాలయ్య అఖండాలో నాయకుడిగా, అఘోరాగానే కనిపించాడు. కాని అఖండ 2 లో మూడో పాత్రలో నాగ సాధువుగా కూడా కనిపించబోతున్నాడు. కాకపోతే నాగ సాధువు పాత్రలో తను వేసేది నెగెటీవ్ రోల్ అని తెలుస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జైలవకుశలో ఒక పాత్ర కామెడీ టచ్ తో, మరో పాత్ర కన్నింగ్ లుక్ లో కనిపించింది. మూడో పాత్రే నెగెటీవ్ రోల్ లో రావణాసురుడిగా కనిపించింది. అన్ని పాత్రలకంటే ఆ రోలే ఎన్టీఆర్ ని హైలెట్ చేసింది. తన కెరీర్ లో ఫస్ట్ టైం మూడు పాత్రల్లో తారక్ కనిపించి, బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఐతే ఇప్పుడు అబ్బాయ్ లానే బాబాయ్ మూడో కన్ను తెరవబోతున్నాడు. మూడో పాత్రలో విలనిజం చూపించబోతున్నాడు. అఖండ 2 లో నాగ సాధువు పాత్ర కాస్త నెగెటీవ్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది

నటసింహం బాలయ్య ఇంతవరకు నెగెటీవ్ రోల్ వేయలేదు. కదిలించే కథ వస్తే విలన్ గా కనిపించటానికి కూడా రెడీనే అని ఎన్నో సార్లు అన్నాడు. కాకపోతే తన సినిమాలోనే తనకి తానే విలన్ గా నటిస్తానన్నాడు. ఆ మాటే నిజమైంది. అఖండ 2 లో తానే హీరోగా రెండు పాత్రలు, విలన్ గా ఒక పాత్ర వేయబోతున్నాడని తెలుస్తోంది.