బాలయ్యకు నాగ వంశీ కాస్ట్లీ గిఫ్ట్.. డాకూ మహారాజ్ సక్సెస్ ఎఫెక్ట్
అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య దుమ్ము రేపుతున్నారు. వరుస హిట్ల తో టాలీవుడ్ లో యంగ్ హీరోలకు కూడా బాలయ్య సవాల్ చేస్తున్నారు.
అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య దుమ్ము రేపుతున్నారు. వరుస హిట్ల తో టాలీవుడ్ లో యంగ్ హీరోలకు కూడా బాలయ్య సవాల్ చేస్తున్నారు. ఏ సినిమా చేసినా సరే పక్కా లెక్కతో చేస్తూ హిట్టు కొడుతున్న బాలకృష్ణ… రీసెంట్ గగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో టాలీవుడ్ ను షేక్ చేశారు. సీనియర్ హీరోల్లో బాలకృష్ణ ఒక్కరే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ సినిమా తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి, లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలు… బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేసేసాయి.
దీనితో బాలయ్య ఇప్పుడు నిర్మాతలకు.. లక్కీ హీరోగా మారిపోయారు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక డైరెక్టర్లు కూడా బాలయ్యతో రాసుకున్న కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. గతంలో బాలకృష్ణ ఏదైనా సినిమా చేయాలంటే కథలు పెద్దగా వినే వారు కాదు. కానీ అఖండ సినిమా తర్వాత నుంచి ఆయన రూట్ మార్చారు. దీనితో డైరెక్టర్లు కూడా కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. గతంలో బాలయ్యతో సినిమా చేయాలంటే భయపడే నిర్మాతలు ఇప్పుడు మాత్రం ఆయనను నమ్మి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు.
అభిమానులు కూడా బాలయ్య సినిమాలకు మార్కెటింగ్ బాగా చేయడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా నిర్మాతలకు పెద్దగా టెన్షన్ ఉండటం లేదు. ప్రమోషన్ విషయంలో బాలయ్య స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలు కూడా పెద్దగా ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. ఇక నిర్మాత సూర్యదేవర నాగావంశీ అయితే ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు రావటంతో బాలయ్యపై మరోసారి ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాకు భారీ లాభాలు రావడంతో బాలయ్యకు మంచి గిఫ్ట్ కూడా రెడీ చేశాడు. కియా కంపెనీ నుంచి ఒక ఖరీదైన కారును బాలయ్యకు గిఫ్ట్ ఇవ్వడానికి నాగవంశీ రెడీ అయ్యాడట. త్వరలోనే డైరెక్టర్ బాబీ కొల్లితో కలిసి బాలయ్యకు గిఫ్ట్ ఇచ్చేందుకు నాగ వంశీ రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. కాస్త ఫ్రీ అయిన తర్వాత బాలయ్యను కలిసి ఆ గిఫ్ట్ ఇవ్వడానికి నిర్మాత రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇక అఖండ సీక్వెల్ ఎలాగైనా సరే సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని బాలయ్య టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారట. డైరెక్టర్ బోయపాటి కూడా ఈ సినిమా కోసం ఎక్కువ టైం తీసుకోవడం లేదు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి నార్మల్ ఆడియన్స్ లో కూడా క్రేజ్ పెరుగుతోంది.