నాగ వంశీ నోటి దూల, బాలీవుడ్ డైరెక్టర్ కు మండింది

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ ఈ మధ్యకాలంలో చేస్తున్న కామెంట్స్ కొన్ని సెన్సేషన్ అవుతున్నాయి. మొన్నామధ్య సినిమా ఆడియన్స్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ అలాగే టికెట్ రేట్లు గురించి మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా ఈ మధ్య కాంట్రవర్సీ అవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 01:01 PMLast Updated on: Jan 02, 2025 | 1:01 PM

Naga Vamsi Rude Behaviour With Bony Kapoor

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ ఈ మధ్యకాలంలో చేస్తున్న కామెంట్స్ కొన్ని సెన్సేషన్ అవుతున్నాయి. మొన్నామధ్య సినిమా ఆడియన్స్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ అలాగే టికెట్ రేట్లు గురించి మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా ఈ మధ్య కాంట్రవర్సీ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ తో వంశీ వ్యవహార శైలిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్ గుప్తా ఈ విషయంలో సీరియస్ అయ్యారు.

బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన బోనీ కపూర్ తో వంశీ మాట్లాడిన తీరుని సంజయ్ గుప్తా తప్పుపట్టారు. బోనీ కపూర్ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చుని తన వ్యాఖ్యలతో ఆయన్ని ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు… అతడి వైఖరి ఏమీ బాగాలేదంటూ సంజయ్ గుప్త ఫైర్ అయ్యారు. నాలుగు హిట్స్ అందుకున్నంత మాత్రాన అతను బాలీవుడ్ కు రాజు కాలేడని టాలీవుడ్ కు చెందిన సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి వారితోను ఇలాగే బిహేవ్ చేస్తాడా అంటూ సంజయ్ గుప్తా ఫైర్ అయ్యారు.

విజయం అందుకోవడం మాత్రమే కాదు గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలంటూ హితవు పలికారు. ఆ తర్వాత సంజయ్ మరో పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో పుష్ప పార్ట్ 2 సినిమా కోసం 86 కోట్లు వసూలు చేసిన తర్వాత బాలీవుడ్ మొత్తం నిద్ర పోలేదని నాగవంశీ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను సంజయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మా ఎగ్జిబిటర్ల వల్లే ఆ సినిమా 86 కోట్లు కలెక్ట్ చేసిందని తెలిసి మేము చాలా ప్రశాంతంగా నిద్రపోయాం అన్నారు. మేము మీలా కాదు ఎదుటి వాళ్ళ విజయం మాకు నిద్రలేని రాత్రులు ఇవ్వదు అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇక ఈ కామెంట్స్ పై నాగవంశీ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్స్ పై వంశి రియాక్ట్ అవుతూ బోని కపూర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, గౌరవం అని పెద్దలను ఎలా గౌరవించాలో మీరు నేర్పాల్సిన అవసరం లేదంటూ సంజయ్ గుప్తాకు కౌంటర్ ఇచ్చారు. మీ కంటే ఎక్కువగా మేము బోని కపూర్ ను గౌరవిస్తామని ఆయనను అగౌరవపరిచేలా నేను ఆ సంభాషణ చేయలేదని ఇది ఆరోగ్యకరమైన చర్చ అంటూ క్లారిటీ ఇచ్చాడు. తామిద్దరం చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడుకున్నామని ఇంటర్వ్యూ తర్వాత పరస్పరం ఆలింగనం కూడా చేసుకున్నామని చెప్పుకొచ్చాడు. కాబట్టి దయచేసి మీరు అలాంటివి చూసి ఒక ఆలోచనకు రావద్దు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలపై అటు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు యాక్టర్లు కూడా ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న వంశీ కాంట్రవర్సీలకు కాస్త కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు.