నీకు 100 సార్లు చెప్పా.. మీడియా ముందే ఆ దర్శకుడికి నాగవంశీ సీరియస్ వార్నింగ్..!
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు, దర్శకులకు ఫ్యాన్స్ ఉంటారు కానీ నిర్మాతలకు చాలా తక్కువ. కానీ టాలీవుడ్ లో ఒక నిర్మాత ఉన్నాడు. మనోడు మైకు పట్టుకుంటే చాలు విజిల్స్ పడుతుంటాయి.

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు, దర్శకులకు ఫ్యాన్స్ ఉంటారు కానీ నిర్మాతలకు చాలా తక్కువ. కానీ టాలీవుడ్ లో ఒక నిర్మాత ఉన్నాడు. మనోడు మైకు పట్టుకుంటే చాలు విజిల్స్ పడుతుంటాయి. అంత క్రేజ్ సంపాదించుకున్న నిర్మాత ఎవరబ్బా అనుకుంటున్నారు కదా..! మీరు అనుకున్నట్టు బండ్ల గణేష్ కాదు.. నాగవంశీ ద వన్ అండ్ ఓన్లీ సూర్యదేవర నాగవంశీ.. కేరాఫ్ సితార ఎంటర్టైన్మెంట్స్. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్స్ లో ఇది కూడా ఒకటి. మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను అందిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు నాగ వంశీ. ఈయన ప్రెస్ మీట్ అంటే చాలు సోషల్ మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినట్టే. మీమర్స్ కూడా పండగ చేసుకుంటారు.
ఒక్క ప్రెస్ మీట్ లో అంత సరుకు ఇస్తాడు నాగ వంశీ. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్ లో మనోడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా గురించి చెబుతూనే ఇంకా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు ఈ నిర్మాత. ముఖ్యంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఇప్పట్లో మొదలు కాదు అని బాంబు పెంచాడు నాగ వంశీ. ఈ విషయం తెలిసి బన్నీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయిపోతున్నారు. మరోవైపు మ్యాడ్ స్క్వేర్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ మీద కూడా సెటైర్ల మీద సెటైర్లు వేశాడు. మీడియా చూస్తుండగానే మనోడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. టీజర్ లో మరీ దారుణంగా 116 రూపాయలు చదివించారు ఏంటి సార్ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. అప్పటికే నా దగ్గర డబ్బులు మొత్తం అయిపోయాయి.. అందుకే 116 రూపాయలు మాత్రమే చదివించాను అని చెప్పాడు.
ఆ తర్వాత దర్శకుడు కళ్యాణ్ శంకర్ గురించి మాట్లాడుతూ.. మా దర్శకుడికి కూడా చాలా సార్లు చెప్పాను స్టేజి మీద ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడొద్దు.. మైకు దొరికితే ఇష్టం వచ్చినట్టు వాగొద్దు అసలు బాగోదు అంటూ చెప్పినా కూడా వినట్లేదు అని వార్నింగ్ ఇచ్చాడు నాగ వంశీ. మైక్ చేతిలో ఉన్నప్పుడు మాట అదుపులో ఉండాలి అని చెప్పుకొచ్చాడు. మ్యాడ్ కంటే 10 రెట్లు ఉంటుంది 20 రెట్లు ఉంటుంది అంటూ అనవసరంగా బిల్డప్ ఇవ్వద్దు అంటున్నాడు నాగ వంశీ. మార్చి 29న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఆ ముందు రోజు హరిహర వీరమల్లు కూడా విడుదల కానుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే తన సినిమాను వాయిదా వేసుకుంటాను అని చెప్పాడు నాగ వంశీ.