RGV Vs NAGABABU: వర్మ వర్సెస్‌ నాగబాబు.. వెళ్లి పెగ్గేసి పడుకో.. నిన్నెవడు చంపుతాడు..

టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్‌ ఆర్జీవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తల నరికి తీసుకువస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆఫర్‌ ఇచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2023 | 05:07 PMLast Updated on: Dec 28, 2023 | 5:10 PM

Nagababu Counter To Ram Gopal Varma Makes Controversy

RGV Vs NAGABABU: వ్యూహం సినిమా నేపథ్యంలో చెలరేగిన వివాదంలో డైరెక్టర్‌ ఆర్జీవీ, జనసేన నేత నాగబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. రీసెంట్‌గా ఓ టీవీషోలో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్‌ ఆర్జీవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తల నరికి తీసుకువస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆఫర్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జీవీ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీవీషో యాంకర్‌ ఉద్దేశపూర్వంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయించారంటూ ఆరోపించారు.

Salaar: స‌లార్ ఊచ‌కోత.. 500 కోట్ల క్లబ్‌లో సలార్

చంద్రబాబు, పవన్‌ కూడా ఈ విషయంలో ఏం స్పందించలేదంటే.. వాళ్లు కూడా కొలికపూడికి మద్దతు తెలిపినట్టే అంటూ చెప్పాడు. ఇదే విషయంలో నాగబాబు రియాక్ట్‌ అయ్యారు. “ఆర్జీవీ.. మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ డోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇండియాలోనూ ఏ పనికిమాలిన వెదవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవడు చంపడు కదా. సో.. మీరేం వర్రీ అవకండి. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ వోడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు” అంటూ పరోక్షంగా కౌంటర్లు వేశారు.

అయితే నాగబాబు కౌంటర్‌పై వెంటనే తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా సినిమాలో మీరు, మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం వీరిద్దరి వార్‌కు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇద్దరి ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. మరి ఈ మాటల యుద్ధం ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.