MEGASTAR CHIRANJEEVI: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్..
ఇప్పటికే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేయగా.. ఇప్పుడు మరో ఫోటో అంతకు మించి అన్నట్లు సెన్సేషన్‌గా మారింది. మెగా బ్రదర్ నాగబాబు తమ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

MEGASTAR CHIRANJEEVI: మెగా ఫ్యామిలీ ప్రస్తుతం పెళ్లి సందడిలో మునిగిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (VARUN TEJ), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఎన్నో ఏళ్ల ప్రేమాయణం తరువాత ఇప్పుడు ఫైనల్‌గా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి సంతోషకర సమయాన్ని గడిపింది. ఇప్పటికే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేయగా.. ఇప్పుడు మరో ఫోటో అంతకు మించి అన్నట్లు సెన్సేషన్‌గా మారింది.
Pawan Kalyan – Ram Charan : పిక్ ఆఫ్ ది డే.. రెండు కళ్లు సరిపోవడం లేదు.. ఇది కాదా కావాల్సి
మెగా బ్రదర్ నాగబాబు తమ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశారు. వరుణ్ పెళ్ళిలో చిరంజీవి (MEGASTAR CHIRANJEEVI), నాగబాబు, పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) ముగ్గురు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. “మా మధ్య ఎన్ని విభేదాలు, వాదనలు ఉన్నా.. మా బంధం మాత్రం ఎప్పటికి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అనుబంధం మేము చేసిన పనులకు, వాటి జ్ఞాపకాలకు చెందినది మాత్రమే కాదు. అది ఎంతో లోతైన బంధం. మాది విడదీయలేని అనుబంధం. మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఈ ఫొటో ఓ జ్ఞాపకం మాత్రమే కాదు.. అంతకు మించింది. మా మధ్య ఉన్న అభిప్రాయాలు, విభేదాల కంటే లోతైన అనుబంధం చాలా ముఖ్యమైనది, బలమైనది. ప్రేమతో కూడిన ఎన్నో మధుర క్షణాలతో ఈ రిలేషన్ ముడిపడి ఉంది. ఇది ఎప్పటికీ విడదీయరానిది. దీనికి నేనెంతో విలువిస్తాను’’ అంటూ నాగబాబు రాసుకొచ్చిన పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఈ ఫొటో చూసి మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ‘పిక్చర్ పర్‌ఫెక్ట్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
PAWAN KALYAN: ఓజీ కథ లీక్.. పవన్ ఫ్యాన్స్‌కు పండుగే!
ఇక అంతకంటే ముందు.. “ఇష్టమైన వారందరి మధ్య ఉండి నా కొడుకు వరుణ్ పెళ్లి చూస్తూ నా మనసు ఎన్నో భావోద్వేగాలు, ఇంకా ఎన్నో జ్ఞాపకాలతో నిండిపోయింది. ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్న వరుణ్ ఇప్పుడు ఒక పరిపూర్ణమైన వ్యక్తి అయ్యాడు. జీవితంలో మరో అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాడు. నాకు ఎంతో గర్వంగా ఉంది.. అలాగే పలు స్మృతులు గుర్తుకువస్తున్నాయి. ఇది మా కుటుంబంలో ఒక అందమైన జర్నీ. ఇప్పుడే మొదలైంది” అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.