Nagarjuna Akkineni: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కింగ్ నాగార్జున
త్వరలో బిగ్ బాస్ సీజన్ సెవన్ స్టార్ట్ కాబోతోంది. సీజన్ 6 ముగిస్తున్నప్పుడు సెవంత్ సీజన్‌కి హోస్ట్ నాగ్ కాదన్నారు. కానీ చివరికి తనే గతయ్యాడట. మరో హీరో ఎవరూ ముందుకు రాకపోవటంతో, నాగ్‌నే మళ్లీ ఒప్పించారట.

Nagarjuna Akkineni: కింగ్ నాగార్జునకి ఏం చేయాలో తోచట్లేదు. ఒక వైపు నాగచైతన్య వరుస ఫ్లాపులతో విసిగపోయాడు. కోట్లు ఖర్చు చేసినా అఖిల్ కెరీర్‌కి రిపేర్లు కరువయ్యాయి. సరే తన సినిమాలైనా బాగా ఆఢుతున్నాయా అంటే అదీ లేదు. నాగార్జున కామెడీ, డ్రామా, యాక్షన్ ఏ జోనర్‌లో వెళ్లినా పంచ్ పడుతోంది.
అందుకే నేను లోకల్, ధమాకా రైటర్ ప్రసన్న కుమార్‌కి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చి, కొత్తగా ఏదో చేయాలనుకున్నాడు. మళ్ళీ ఏమనిపించిందో కాని, ఆ ఆలోచనే పక్కన పెట్టాడు. సినిమాను కూడా హోల్డ్‌లో పెట్టి బుల్లి తెరమీద వాలుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ సెవన్ స్టార్ట్ కాబోతోంది. సీజన్ 6 ముగిస్తున్నప్పుడు సెవంత్ సీజన్‌కి హోస్ట్ నాగ్ కాదన్నారు. కానీ చివరికి తనే గతయ్యాడట. మరో హీరో ఎవరూ ముందుకు రాకపోవటంతో, నాగ్‌నే మళ్లీ ఒప్పించారట. నాగ్ కూడా తన సినిమాలేవీ ఆడట్లేదు కాబట్టే, మార్పు కోసం మళ్లీ బిగ్ బాస్ కొత్త సీజన్‌కి సై అన్నాడట.
కాకపోతే బిగ్‌బాస్ షోకు సంబంధించి ఇప్పటికే ఒక్కో సీజన్‌లో కంటెస్టెంట్లు, గేమ్స్ అన్నీ బోర్ కొడుతూ కొడుతూ, క్యూరియాసిటీ తగ్గుతూ వస్తోంది. సో ఏడో సీజన్‌కి గత సీజన్స్‌లా రేటింగ్స్ రాక డీలా పడితే, వెండితెర తర్వాత బుల్లితెరలో కూడా నాగ్‌కి పంచ్ పడినట్లవుతుంది. ఆ ఎఫెక్ట్ తన నెక్ట్స్ మూవీ మీద పడే ఛాన్స్ ఉంది.