Naa Saami Ranga: మాస్ స్టెప్పులతో నా సామిరంగ టైటిల్ సాంగ్ విడుదల..

ఆదివారం ఈ చిత్ర టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. నా సామిరంగ పేరుతో విడుదలైన ఈ లిరికల్ వీడియో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్.. ముగ్గురూ ఈ పాటలో కనిపించడం విశేషం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 31, 2023 | 07:51 PMLast Updated on: Dec 31, 2023 | 7:51 PM

Nagarjuna Akkinenis Naa Saami Ranga Movie Title Song Released

Naa Saami Ranga: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగ. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా.. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్ర యూనిట్. తాజాగా ఆదివారం ఈ చిత్ర టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ.

TTD: శ్రీవారి దర్శనం.. జనవరి 2 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ..

నా సామిరంగ పేరుతో విడుదలైన ఈ లిరికల్ వీడియో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్.. ముగ్గురూ ఈ పాటలో కనిపించడం విశేషం. మాస్ సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాటలో ముగ్గురూ తమ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ముగ్గురి మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా పాటలో చెప్పేశారు. చాలా కాలం తర్వాత నాగార్జున ఈ చిత్రంలో మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. సీనియర్ హీరోల్లో నాగార్జునకు చాలా కాలంగా సరైన హిట్ లేదు. దీంతో తప్పకుండా ఈ సినిమా ఆయన ఫ్యాన్స్‌తోపాటు ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుందనే నమ్మకంతో ఉంది చిత్ర బృందం. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో, యాక్షన్, కామెడీ ప్రధానాంశాలుగా నా సామిరంగ రాబోతుంది. ఈ సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.