BIGG BOSS 8 : బిగ్ బాగ్ లొల్లి.. సెప్టెంబర్ లో బిగ్ బాస్ సందడి
పక్కింట్లో కొట్లాట జరిగితే ఊరుకుంటామా. కళ్ల చూసి ఎంటర్‌టైన్ అవుతుంటాం. పనులు పక్కన పెట్టిన లొల్లిని వింటాం. అలాంటిది. అలాంటి కాన్ఫెప్ట్‌తో వచ్చే బిగ్ బాస్‌ను వదిలిపెడతామా.

Nagarjuna means 'Bigg Boss' to Telugu television viewers. Nagarjuna means Big Boss. He built a brand image at that level.
పక్కింట్లో కొట్లాట జరిగితే ఊరుకుంటామా. కళ్ల చూసి ఎంటర్‌టైన్ అవుతుంటాం. పనులు పక్కన పెట్టిన లొల్లిని వింటాం. అలాంటిది. అలాంటి కాన్ఫెప్ట్‌తో వచ్చే బిగ్ బాస్‌ను వదిలిపెడతామా. సమస్యే లేదు. టీఆర్పీలు రికార్డ్ లెవల్లో ఎగబాకే వరకు కొత్త రికార్డులు బద్దలు కొట్టే వరకు చూస్తూనే ఉంటాం. మొదటి సీజ్ నుంచి రీసెంట్‌గా వచ్చిన సీజన్7ను హిట్ చేసేశాం . ఇక ఇప్పుడు బిగ్ బాస్ 8 ముస్తాబవుతోంది. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చేయడంతో లోగోను రిలీజ్ చేయడంతో బుల్లితెర అభిమానులు ఖుషి అవుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి తొందర్లో ఈ సీజన్ మొదలు కానుంది.
తెలుగు బుల్లితెర వీక్షకులకు ‘బిగ్ బాస్’ అంటే నాగార్జున. నాగార్జున అంటే బిగ్ బాస్. ఆ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. అందుకే మాటల్లేవ్ మాట్లాడుకోవడాలు లేవ్ అన్నట్లు గా నాగ్ మేనియాను క్రియట్ చేశాడు. ఫస్ట్ సీజన్ హోస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే… రెండో సీజన్ హోస్ట్ నేచురల్ స్టార్ నాని. ఇక ఆ తర్వాత సీజన్స్ అన్నిటికీ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇప్పుడు అదే జోష్ ను కంటిన్యూ చేయడానికి వచ్చేస్తున్నాడు. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు ఈ సారి అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. బుల్లి తెర టాక్ ప్రకారం సెప్టెంబర్ లో షో మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
బిగ్ బాగ్ లోగో బయటకు రాగానే ఎప్పుడెప్పుడు ప్రారంభమవతుందా అని ఎదురు చేస్తున్నారు ఫ్యాన్ప్. అయితే ఈ సారి లాంచింగ్ ఎపిసోడ్ ఐ ఫీస్ట్ లా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కొత్త రూల్స్ తో కొత్త కండిషన్లతో ఫుల్ ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారట షో నిర్వహకులు. సెట్ వివరాల నుంచి కంటెస్టెంట్స్ గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇదిలా ఉంటే… ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ… హౌస్ లో సందడి చేయనున్నట్ల సభ్యుల గురించి నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈసారి కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి సోషల్ మీడియా, టీవీ స్టార్స్‌తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెంస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. బంచిక్ బబ్లూ, రీతూ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రిత, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా, బర్రెలక్క, కుమారి ఆంటీ, ఖుషిత కల్లపు పేర్లు కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా ప్రచారం జరుగుతోన్నాయి. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.