Nagarjuna: నాగార్జున కొత్త సినిమా ఎప్పుడు..ఫెయిల్యూర్స్ నుంచి బయట పెడతాడా..?
పుట్టిన రోజునే కొత్త సినిమా ఎనౌన్స్ చేయాలన్న సెంటిమెంట్‌తో సీనియర్ హీరోలు వున్నట్టున్నారు. మెగాస్టార్ బర్త్‌డేనాడు రెండు సినిమాలు ప్రకటించారు. నాగార్జున కొత్త సినిమా వివరాలు తెలియాంటే.. 29 వరకు వెయిట్ చేయాల్సిందే.

Nagarjuna Na Sami Ringa is going to be directed by dance master Vijay Bunny
పుట్టిన రోజునే కొత్త సినిమా ఎనౌన్స్ చేయాలన్న సెంటిమెంట్‌తో సీనియర్ హీరోలు వున్నట్టున్నారు. మెగాస్టార్ బర్త్‌డేనాడు రెండు సినిమాలు ప్రకటించారు. నాగార్జున కొత్త సినిమా వివరాలు తెలియాంటే.. 29 వరకు వెయిట్ చేయాల్సిందే. ఘోస్ట్ తర్వాత ఈ సీనియర్ హీరోను వరుస ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. సోగ్గాడే చిన్నినాయనలో బంగార్రాజుగా ఓకె అనిపించుకున్నా.. అలాంటి హిట్ మళ్ళీపడలేదు. ఘోస్ట్ మూవీ లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో రిలీజైంది. దాదాపు 10 నెలలు కావస్తున్నా.. నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేయలేదు. నాగార్జున ఒకటనుకుంటే.. మరోటి జరగుతోంది.
కథ, డైరెక్టర్‌ను సెట్ చేసుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది. ఘోస్ట్ ప్లాప్ తర్వాత ధమాకాకు మాటలు రాసిన బెజవాడ ప్రసన్నకుమార్‌కు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. సినిమా ఇంకా సెట్స్‌పైకి వస్తుందనగా.. రీమేక్‌ను ఫ్రీమేక్‌గా తీస్తున్నారంటూ ఓ నిర్మాత ఆరోపించాడు. ఇన్‌స్పిరేషన్‌గా తీస్తున్నానని దర్శకుడు చెప్పడంతో.. అంతా సెటిల్ చేసి దర్శకుడిని మార్చేశారట నాగార్జున. నాగార్జున కొత్త సినిమా డైరెక్టర్‌గా బెజవాడ ప్రసన్నకుమార్ ప్లేస్‌లోకి డ్యాన్స్ మాస్టర్ విజయ్ బన్నీ వచ్చాడు. గతంలో మాస్ మూవీతో లారెన్స్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేసిన నాగ్.. మరో కొరియోగ్రాఫర్‌కు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు.
సినిమాకు ‘నా సామి రంగా’ అన్న టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ను నాగ్ బర్త్‌డే సందర్భంగా 29న ఎనౌన్స్ చేస్తారని తెలిసింది. నా సామిరంగా సినిమాకు కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. నాగ్, కీరవాణి కాంబోలో.. అన్నమయ్య.. రామదాసు.. వారసుడు.. అల్లరి అల్లుడు.. భీమరం బుల్లోడు వంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. దీంతో హిట్ కాంబో రిపీట్ అవుతోంది అనుకుంటున్నారు అంతా.