అఖిల్ కోసం నాగార్జున రిస్క్.. విలన్ కోసం 18 కోట్లు, యంగ్ డైరెక్టర్ పై భారం
సినిమాల్లోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు అఖిల్ అక్కినేని. అక్కినేని ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోలు అందరూ హిట్ టేస్ట్ చూసిన అఖిల్ మాత్రం ఆ టేస్ట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.
సినిమాల్లోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు అఖిల్ అక్కినేని. అక్కినేని ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోలు అందరూ హిట్ టేస్ట్ చూసిన అఖిల్ మాత్రం ఆ టేస్ట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కొత్త హీరోలు అందరూ ఏదో ఒక సినిమాతో హిట్టు కొడుతుంటే అఖిల్ మాత్రం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇక రీసెంట్గా అఖిల్ కోసం సీనియర్ డైరెక్టర్ల నుంచి యంగ్ డైరెక్టర్ వరకు అందరూ కథలు వినిపించిన నాగార్జున మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా అఖిల్ కోసం ఒక కథ వినిపించాడు.
ఆ కథ విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఏజెంట్ భారీ డిజాస్టర్ అయిన తర్వాత అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం మురళీకృష్ణ అబ్బోరి డైరెక్షన్లో తన నెక్స్ట్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్టు సినీ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. ఈ సినిమాలో అఖిల్ రోల్ ను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసిన డైరెక్టర్ ఇక విలన్ గా బాలీవుడ్ యాక్టర్ ను తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఇక ఈ సినిమా ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని నాగార్జున కూడా మురళీకృష్ణ చెప్పిందానికి ఓకే చేశాడట.
1992 స్కాం సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న ప్రతిక్ గాంధీ.. అఖిల్ సినిమాలో విలన్ రోల్ చేయబోతున్నాడు. ఈ రోల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ప్లాన్ చేశాడు మురళీకృష్ణ. ఇక ఈ సినిమాలో చేయడానికి 18 కోట్లు డిమాండ్ చేశాడట. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో తమిళ స్టార్ ను కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి మంచి కం బ్యాక్ ఇవ్వాలని… కనీసం 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వాలని అఖిల్ పట్టుదలగా ఉన్నాడు.
పక్క కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ సినిమాలో ఒక మాజీ హీరోయిన్ కు కూడా పవర్ఫుల్ రోల్ ఇస్తున్నారు. ఇప్పుడు విలన్ రెమ్యూనరేషన్ సినిమాకు హాట్ టాపిక్ అవుతుంది. హీరో కంటే డైరెక్టర్ కంటే విలన్ ఎక్కువ తీసుకుంటున్నాడు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న అఖిల్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సినిమాను మొదలుపెట్టే ఛాన్స్ ఉందని న్యూస్ కూడా వస్తోంది.