అన్ స్టాపబుల్ కు వద్దు.. చైతన్యకు నాగార్జున వార్నింగ్
ఈ మధ్యకాలంలో ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ లో ప్రమోషన్స్ మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి.
ఈ మధ్యకాలంలో ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ లో ప్రమోషన్స్ మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణతో అన్ స్టాపబుల్ లో ఒక ఎపిసోడ్ చేస్తే కచ్చితంగా కలిసి వస్తుందని హీరోలు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోలు… ఈ షో వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ అయినా సరే సినిమా ప్రమోషన్ కోసం ముందుగా ఇక్కడకు వచ్చేస్తున్నారు. ఇక బాలకృష్ణ కూడా వాళ్ళ విషయంలో చాలా పాజిటివ్ గా ఉంటూ వాళ్ళ ప్రమోషన్స్ కు హెల్ప్ చేస్తున్నారు.
రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన రెండు సినిమాలకు బాలయ్య హెల్ప్ చేశారు. అటు ఆహా యాజమాన్యం కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగానే ప్లాన్ చేసుకుంటుంది. ఇక ఫ్యూచర్ లో కూడా మరిన్ని సినిమాలకు ప్రమోషన్స్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రజెంట్ నడుస్తున్న సీజన్ కంప్లీట్ కాలేదని టాక్. త్వరలోనే మరో సినిమా ప్రమోషన్ కూడా ఇక్కడ చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సినిమా చావా, అలాగే నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమా ప్రమోషన్స్ ను ఇక్కడ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
దీనికి అల్లు అరవింద్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాను స్వయంగా నిర్మిస్తున్న సినిమా కావడంతో, అల్లు అరవింద్ ఈ సినిమా ప్రమోషన్స్ ను బాలయ్య తో చేయించాలని ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీగా పెట్టుబడి పెట్టి చేస్తున్న సినిమా కావడంతో, ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని నాగచైతన్య కూడా పట్టుదలగా ఉన్నాడు. అయితే.. అన్ స్టాపబుల్ లో ప్రమోషన్స్ వద్దని నాగార్జున చెప్పడంతో అల్లు అరవింద్ వెనక్కు తగ్గినట్లు సమాచారం. తండెల్ సినిమా ఇంపార్టెన్స్ ను దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ ప్రమోషన్స్ విషయంలో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
ఇక రిలీజ్ కూడా దగ్గర పడుతోంది. ఈ టైంలో అన్ స్టాపబుల్ లో ప్రమోషన్స్ చేస్తే కచ్చితంగా కలిసి వస్తుందని, నందమూరి ఫ్యాన్స్ సినిమాను చూసే ఛాన్స్ ఉంటుందని భావించారు. బాలయ్య టైమింగ్ అలాగే ఆయన మాట్లాడే మాటలు ఫాన్స్ కు కచ్చితంగా నచ్చుతాయని, సినిమా ఖచ్చితంగా ఇక్కడ ప్రమోషన్ చేస్తే కలెక్షన్స్ విషయాల్లో దూసుకుపోవటం ఖాయమని అల్లు అరవింద్ భావిస్తుంటే, నాగార్జున మాత్రం అందుకు నో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికే సౌత్ మార్కెట్ మీద గట్టిగా ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేశారు. మరి తెలుగులో ప్రమోషన్స్ విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.