కొడుకు-కోడలికి నాగ్ భారీ గిఫ్ట్… ఖరీదు ఎంతంటే

అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి వేరే లెవెల్ లో ఉంది. ఏడు రోజుల పెళ్లిని చాలా గ్రాండ్ గా చేస్తోంది అక్కినేని ఫ్యామిలీ. అతిధులు తక్కువే అయినా పెళ్లి మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేసారు నాగార్జున.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2024 | 06:42 PMLast Updated on: Dec 02, 2024 | 6:42 PM

Nags Huge Gift To Son And Daughter In Law How Much Does It Cost

అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి వేరే లెవెల్ లో ఉంది. ఏడు రోజుల పెళ్లిని చాలా గ్రాండ్ గా చేస్తోంది అక్కినేని ఫ్యామిలీ. అతిధులు తక్కువే అయినా పెళ్లి మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేసారు నాగార్జున. ముందు ఎక్కడో చేయాలని భావించినా తర్వాత అన్నపూర్ణ స్టూడియోలోనే గ్రాండ్ గా చేసేందుకు రెడీ అయ్యారు. కేవలం 300 మంది మాత్రమె ఈ వివాహానికి హాజరు అవుతున్నారు. ముందు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని భావించినా కేవలం అత్యంత సన్నిహితులను మాత్రమె ఆహ్వానిస్తున్నారు.

ఇక ఈ పెళ్లి కోసం… భారీగానే ఖర్చు చేస్తోంది అక్కినేని ఫ్యామిలీ. దాదాపు 30 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పెళ్ళికి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ భారీగానే ఉంది. ఈ పెళ్లి కోసం బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్లను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. ఇంత క్రేజ్ ఉన్న పెళ్లి కోసం… లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ భారీగానే ఖర్చు చేస్తోంది. 50 కోట్ల రూపాయలకు హక్కులను కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ షికారు చేస్తున్నాయి.

ఈ పెళ్లిలో శోభిత కంజీవరం పట్టు చీర కట్టుకోనుంది. దాని ఖర్చు దాదాపుగా 74 లక్షలు అయినట్టు జాతీయ మీడియా పేర్కొంది. అలాగే కడప జిల్లాలోని పొందూరు ఖద్దరు కూడా ధరించనున్నారు. పెళ్లి తంతు మొత్తం 8 గంటల్లో చేయనున్నారు. దీనికోసం ప్రముఖ పండితులను కూడా ఆహ్వానించారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ… అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ఈ వివాహం చేస్తున్నారు. ఇదిలా ఉంటె… ఈ పెళ్లి కోసం తన కొడుకు కోడలికి అక్కినేని నాగార్జున భారీ గిఫ్ట్ ను కొనుగోలు చేసారు అని టాక్.

ఈ నెల నాలుగున జరగనున్న ఈ పెళ్లికి… నాగార్జున లెక్సస్ ఎలక్ట్రిక్ కారును కొని ఇచ్చారు. దీనిని ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో నాగార్జున సందడి చేసారు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసమే ఆయన అక్కడికి వచ్చారు. అలాగే కొన్ని విలువైన బంగారు ఆభరణాలను కూడా నాగార్జున కొడుకు, కోడలికి ఇవ్వనున్నారు. ఇక ఎలక్ట్రిక్ కారు ధర భారీగానే ఉంది. 2 కోట్ల 10 లక్షల విలువ చేసే కారును కానుకగా ఇవ్వనున్నారు. అలాగే నాగ చైతన్య తల్లి కూడా ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారు. వెంకటేష్ కూడా తన మేనల్లుడి కోసం స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్టు టాక్.