కేపీ చౌదరి డైరీలో ప్రముఖుల పేర్లు ?మళ్లీ సినీ ఇండస్ట్రీ డ్ర*గ్స్‌ ప్రకంపణలు

కబాలి ప్రొడ్యూసర్‌ కృష్ణప్రసాద్‌ ఆత్మహత్య ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న గోవాలో సూసైడ్‌ చేసుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగానే కేపీ చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 03:05 PMLast Updated on: Feb 05, 2025 | 3:05 PM

Names Of Celebrities In Kp Chaudharys Diary

కబాలి ప్రొడ్యూసర్‌ కృష్ణప్రసాద్‌ ఆత్మహత్య ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న గోవాలో సూసైడ్‌ చేసుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగానే కేపీ చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ గతంలో కేపీ పలు డ్రగ్స్‌ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేపీకి చెందిన డైరీ ఒకటి పోలీసులకు దొరకింది. ఈ డైరీలో పలు కీలక విషయాలు ఉన్నట్టు సమాచారం. కేపీ కేసులో ఈ డైరీ అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. కబాలి సినిమాకు ప్రొడ్యూసర్ అయిన కేపీ చౌదరి సినిమాల వళ్ల చాలా నష్టపోయాడు. అనుకున్న సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాడు.

దీంతో అప్పుడు చేయడం.. ఆ అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కడంతో కేపీ జీవితం పూర్తిగా క్రైంతో నిండిపోయింది. ఈజీ డబ్బు సంపాదించేందుకు గోవా నుంచి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ తీసుకుని వచ్చి హైదరాబాద్‌, చెన్నైలో అమ్మడం మొదలు పెట్టాడు. దాదాపు సంవత్సరం క్రితం ఇదే కేసులో కేపీ అరెస్ట్‌ కూడా అయ్యాడు. కేపీ నుంచి దాదాపు 70 లక్షలు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేపీతో ఎవరెవరికి లింకులు ఉన్నాయి. ఈ డ్రగ్స్‌ ఎవరైనా అర్డర్‌ ఇస్తేనే కేపీ తెప్పించాడా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు కూడా చేశారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో కేపీకి డ్రగ్స్‌ విషయంలో ఎవరితో సంబంధాలు ఉన్నాయి అనేది కూడా కీలకంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎలాంటి క్లారిటీ రాకుండానే కేపీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కేపీ డైరీ ద్వారా ఈ డ్రగ్స్‌ లింకులకు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది.

డైరీలో చాలా మంది పేర్లు వాళ్లతో కేపీకి ఉన్న సంబంధాల గురించి సమాచారం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థికగా ఎవరితో ఎలాంటి సంబధాలు ఉన్నాయి.. ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలి, ఎవరి నుంచి ఎంత డబ్బు రావాలి అనే విషయాలు కూడా కేపీ డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలు కూడా ఈ డైరీ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ డ్రగ్స్‌ కేసు బస్ట్‌ అయినా ఏదో ఒక రకంగా అది సినీ ఇండస్ట్రీకి కనెక్ట్‌ అవుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో ఏకంగా ఓ సినిమా ప్రొడ్యూసర్‌ డ్రగ్స్‌ దందా అంటే.. ఖచ్చితంగా చాలా మంది సినిమా వాళ్ల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు పోలీసులు.